హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మద్యం,తెలంగాణ: బాబు,జగన్‌పై విరుచుకుపడ్డ కాంగ్రెస్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Gandra Venkata Ramana Reddy
హైదరాబాద్: మద్యం విషయంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ విషయంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై కాంగ్రెసు పార్టీ సోమవారం తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. పార్లమెంటులో జగన్ సమైక్య వాదం వినిపించారని ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి అన్నారు. టిడిపితో కలిసి సమైక్యాంధ్రకు మద్దతుగా ప్లకార్డులు పట్టుకున్న జగన్ తనను తెలంగాణ ప్రజలు ఎలాగూ నమ్మరనే ఉద్దేశ్యంతో ఉప ఎన్నికల్లో పోటీ పెట్టక పోవచ్చునన్నారు. అలా కాకున్నా అంతర్గతంగా ఎవరితోనైనా అవగాహన ఉన్నా ఆయన వెనక్కి తగ్గవచ్చునన్నారు.

రాష్ట్రంలో బెల్టు షాపులకు తాళం చెవులు ఇచ్చిందే చంద్రబాబు అని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. మద్యం నిషేధానికి బాబు తన హయాంలో తూట్లు పొడిచి ఇప్పుడు కాంగ్రెసుపై విరుచుకు పడటం విచారకరమన్నారు. కాంగ్రెసుకు ఓట్లు వేసినందుకు ప్రజలు బాధపడుతున్నారని బాబు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. అధికారం దూరమైనప్పటి నుండి ఆయనకు నిద్ర పట్టడం లేదన్నారు. బాబు చెప్పేవి శ్రీరంగ నీతులు చేసేవి వెదవ పనులని రుద్రరాజు పద్మరాజు ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని మధ్యాంద్ర ప్రదేశ్‌‌గా మార్చింది బాబే అన్నారు. సిబిఐ దర్యాఫ్తుకు సిద్ధమని బొత్స అంటే బాబు స్టేలు తెచ్చుకుంటున్నారన్నారు.

English summary
Congress leaders fired at TDP chief Nara Chandrababu Naidu and YSR Congress Party chief YS Jaganmohan Reddy for liquor and Telangana issues.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X