హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఐపిఎస్ హత్య కేసులో నిందితుడు నజీబ్ అరెస్టు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్: ఐపిఎస్ అధికారి కృష్ణ ప్రసాద్ హత్య కేసులో నిందితుడైన హిజ్‌బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది నజీబ్ అహ్మద్‌ను కౌంటర్ ఇంటెలిజన్స్ పోలీసులు అరెస్టు చేశారు. నజీబ్ అహ్మద్ ఇరవయ్యేళ్లుగా పరారీలో ఉన్నాడు. కృష్ణప్రసాద్‌పై కాల్పులు జరిపినప్పుడు నజీబ్ అక్కడే ఉన్నట్లు అభియోగాలు ఉన్నాయి. ఆ కేసులో ఆయనను పోలీసులు అరెస్టు చేసి ఆ తర్వాత క్షమాభిక్ష పైన విడుదల చేశారు. అప్పటి నుండి నజీబ్ పోలీసుల కన్నుగప్పి తిరుగుతున్నాడు. మారు పేర్లు, మారు వేషాలతో దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉంటున్నాడు. అయితే సోమవారం ఎట్టకేలకు కౌంటర్ ఇంజెలిజెన్స్ పోలీసులకు చిక్కారు.

నజీబ్ ఇన్నాళ్లు ఎక్కడ ఉన్నాడు? ఏం చేశాడు? అనే కోణంలో పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. కాగా ఐపిఎస్ కృష్ణ ప్రసాద్ హత్య కేసులో ప్రధాన నిందితుడు ముజీబ్‌కు నాంపల్లి కోర్టు ఇరవయ్యేళ్ల క్రితమే యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 2004లో విడుదలైన ముజీబ్ మళ్లీ ఆయుధాలు సరఫరా చేస్తూ ఎనిమిదేళ్ల క్రితం పట్టుబడ్డాడు. ఇప్పుడు అరెస్టైన నజీబ్, ముజీబ్‌కు అత్యంత సన్నిహితుడు. పోలీసులు నజీబ్‌ను మంగళవారం కోర్టులో హాజరు పర్చే అవకాశముంది.

English summary
Nazeeb Ahmed, who is accused in IPS Krishna Prasad murder was arrested by counter intelligence police today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X