వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైనాలో భారత దౌత్యవేత్తపై స్థానిక వ్యాపారుల దాడి

By Srinivas
|
Google Oneindia TeluguNews

China
బీజింగ్: చైనాలో భారత దౌత్యవేత్తపై స్థానిక వ్యాపారులు దాడి చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చైనాలోని షాంఘై భారత దౌత్య కార్యాలయంలో పని చేస్తున్న అధికారి ఎస్ బాలచంద్రన్‌పై డిసెంబర్ 31వ తేదిన ఈవూ కోర్టులో దాడి జరిగింది. వ్యాపార లావాదేవీల్లో భాగంగా ఇద్దరు భారతీయులను స్థానిక వ్యాపారులు కిడ్నాప్ చేశారు. వారిని విడిపించేందుకు బాలచంద్రన్ ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన డిసెంబర్ 31న ఈవూ కోర్టులో సంప్రదింపుల అనంతరం బయటకు వస్తుండగా ఆయనపై దాడి జరిగింది. ఈ దాడిలో ఇతనికి తీవ్రంగా గాయాలయ్యాయి. వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. కంపెనీ ఖాతాలు చెల్లించనందున ఆ ఇద్దరు భారతీయులను స్థానిక వ్యాపారులు రెండు వారాల క్రితం కిడ్నాప్ చేశారు. సదరు కంపెనీ సొంతదారులు మాత్రం అప్పటికే దేశం వదిలి పారిపోయారు.

దీపర్ రహేజా, శ్యాంసుందర్ అగర్వాల్ అనే ఇద్దరు వ్యాపారులను విడిపించే ప్రయత్నంలోనే ఆయనపై దాడి జరిగిందని షాంఘై ఇండియన్ కాన్సులేట్ జనరల్ కన్సల్ ఒకరు చెప్పారు. సంఘటన జరిగిన రోజు బాలచంద్రన్ సుమారు ఐదు గంటలు పాటు వారిని విడిపించేందుకు ప్రయత్నాలు చేశారన్నారు. దాడి ఘటన పోలీసులు, జడ్జిల సమక్షంలోనే జరిగిందన్నారు. స్థానిక అధికారులు దాడి ఘటనపా బాలచంద్రన్‌కు క్షమాపణ చెప్పారు. కాగా ప్రస్తుతం ఆయన పరిస్థితి బాగానే ఉందని, వివిధ రకాల పరీక్షలు ఆయనకు జరుగుతున్నాయన్నారు.

English summary
An Indian diplomat was injured and hospitalized following an assault by a large group of Chinese traders in a court, as he tried to secure the release of two Indians who were held hostage by locals, demanding payment of their dues in the eastern business hub of Yiwu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X