అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సూరిహత్య వెనుక పరిటాల ఫ్యామిలీ,టిడిపి: భానుమతి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Gangula Bhanumati
అనంతపురం: తన భర్త మద్దెలచెర్వు సూరి హత్యకు పరిటాల కుటుంబం, పరిటాల అనుచరులు, తెలుగుదేశం పార్టీయే కారణమని సూరి భార్య గంగుల భానుమతి మంగళవారం అనంతపురం జిల్లాలో ఆరోపించారు. పరిటాల కుటుంబం నుండి తనకు కూడా ప్రాణ హాని ఉందని ఆమె ఆరోపించారు. సూరి హత్య తర్వాత తన కుటుంబం కష్టాల్లో ఉందన్నారు. పోతుల సురేష్, చమన్ సహకారంతో నన్ను చంపే అవకాశముందని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. సూరి హత్యకు పరిటాల కుటుంబీకులే కారణమన్నారు. తెలుగుదేశం పార్టీ నేతలతో కుమ్మక్కై భాను కిరణే హత్య చేశాడని ఆరోపించారు.

టిడిపి కోవర్టుగా మారిన భాను సూరిని హత్య చేశాడన్నారు. భాను ఇప్పటికీ బతికే ఉన్నాడన్నారు. ఇటీవల హత్యకు గురైన పటోళ్ల గోవర్ధన్ రెడ్డి, మద్దెలచెర్వు సూరి హత్యకు చాలా వ్యత్యాసముందన్నారు. మద్దెలచెర్వు సూరి హత్య కేసులో నిందితులను త్వరగా పట్టుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

English summary
Maddelacheruvu Suri wife Bhanumathi suspected Paritala Ravi family and TDP behind Suri murder.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X