• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సీరియల్ కిల్లర్ మరో ఘాతుకం: మహిళ రేప్, హత్య

By Pratap
|

Mahaboob Nagar District
మహబూబ్‌నగర్: మహబూబ్ నగర్ జిల్లాలో సీరియల్ కిల్లర్ మరో ఘాతుకానికి పాల్పడ్డాడు. మహబూబ్ నగర్ జిల్లాలోని షాద్ నగర్ ప్రాంతంలో సోమవారం మరో మహిళ శవం కనిపించింది. ఆ మహిళను రేప్ చేసి, ఆ తర్వాత చంపేసి పట్టణం శివారులో పడేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రేప్, హత్య సంఘటనలు స్థానికులకు తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఈ ఘాతుకానికి సీరియల్ కిల్లర్ పాల్పడ్డాడా, మరెవరైనా పాల్పడి ఉంటారా అనే విషయంపై కూడా పోలీసులు నిర్ధారణకు రాలేకపోతున్నారు. నేరం చేసిన తర్వాత నిందితుడు మహిళ గాజులు కూడా తీసుకుని వెళ్లలేదని పోలీసు అధికారులు చెబుతున్నారు.

షాద్ నగర్‌లో, ఆ పట్టణం శివారల్లో గత కొద్ది నెలల్లోనే 16 రేప్, హత్య సంఘటనలు చోటు చేసుకున్నాయి. చాలా మృతదేహాలు పట్టణం శివారులోని పొదల్లో పడి ఉండడం గమనార్హం. స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతుండగా, పోలీసులకు ఏ విధమైన క్లూలు లభించడం లేదు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The serial killer continues to be on the prowl in Shadnagar area as yet another woman's mutilated body was found on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more