హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆజాద్‌పై టి-కాంగ్ ఎంపీలు గుర్రు, బాబు యాత్రపై ఫైర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Ponnam Prabhakar
హైదరాబాద్: ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత తెలంగాణపై నిర్ణయం ఉంటుందని కేంద్రమంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్ వ్యాఖ్యానించడం దురదృష్టకరమని తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు మందా జగన్నాథం శుక్రవారం అన్నారు. ఎంపీలు మందా, పొన్నం ప్రభాకర్, వివేక్, గుత్తా సుఖేందర్ రెడ్డి తదితరులు మీడియాతో మాట్లాడారు. ఉప ఎన్నికల్లో పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఉద్యమంలో వెనుకడుగు వేసే ప్రసక్తి లేదన్నారు. తెలంగాణ కోసం మేమంతా కట్టుబడి ఉన్నామని అందుకోసం ఉద్యమిస్తామన్నారు. ప్రజల ఆకాంక్షను అధిష్టానం దృష్టికి తీసుకు వెళతామన్నారు. వరంగల్ జిల్లాలో రైతు పోరు యాత్ర చేపడుతున్న తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పైన ఎంపీలు విరుచుకు పడ్డారు.

బాబుకు ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారని టిటిడిపి నేతలు అంటున్నారని కానీ అంతమంది పోలీసులతో వెళ్లడం ప్రజాస్వామ్యమా అని ప్రశ్నించారు. బాబువి అవకాశవాద రాజకీయాలని, ప్రజలు వ్యతిరేకిస్తున్నా టిటిడిపి నేతలు చెంచాలుగా మారి బాబును జిల్లాకు తీసుకు వస్తున్నారన్నారు. తెలంగాణకు వ్యతిరేకం కాదన్న ఆయన అనుకూలంగా ఎందుకు ప్రకటన చేయరన్నారు. ఇతర జిల్లాల టిడిపి కార్యకర్తలు ఆ జిల్లా వారిపై పోలీసు సమక్షంలో దాడులు చేస్తున్నారని విమర్శించారు. రాజకీయ ఉనికి కోసమే యాత్ర అని, అయినా ప్రజలు బాబును నమ్మే స్థితిలో లేరన్నారు. తాము కూడా ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తామని, బాబును అడ్డుకోమని చెప్పమని, అయితే టిడిపి దాడులు మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దాడి చేసిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు.

English summary
T-Congress party mps fired at central minister Ghulam Nabi Azad for his comments on Telangana issue and Chandrababu for his tour in Warangal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X