గాలి బ్రదర్స్‌తో యడ్యూరప్ప చేతులు కలుపుతారా?

తన డిమాండ్‌పై పార్టీ పెద్దలతో, ముఖ్యంగా ఎల్‌కె అద్వానీతో మాట్లాడేందుకు యడ్యూరప్ప తనకు అత్యంత సన్నిహితురాలైన శోభా కరండ్లజేతో పాటు ఇద్దరు మంత్రులను ఇటీవల ఢిల్లీకి పంపించారు. అయితే అధిష్టానం పెద్దలు వారికి ఏ మాత్రం ప్రాధాన్యం ఇవ్వలేదు. ఆ తర్వాత బెంగళూర్ శాసనసభ్యుల మద్దతు సాధించడానికి ప్రయత్నించారు. అయితే, అనివార్య స్థితిలో ఆయన రాజీనామా చేశారు. ఆ తర్వాత అరెస్టయ్యారు. ఆయన 25 రోజుల పాటు జైలులో ఉన్నారు. అయితే, యడ్యూరప్ప వేచి చూడడానికి సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు. కానీ ఆయన సహనం క్రమంగా నశిస్తోంది. తన డిమాండును అంగీకరించకపోతే జనవరి 15వ తేదీ తర్వాత రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడతానని ఆయన అధిష్టానం పెద్దలను హెచ్చరించారు. కాగా, మధ్యంతర ఎన్నికలు వస్తాయనే ఊహాగానాలను ఆయన తోసిపుచ్చారు. పూర్తి కాలం బిజెపి అధికారంలో ఉంటుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications