హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిరంజీవి టీ పార్టీకి ఆజాద్ సహా స్పీకర్ మనోహర్

By Pratap
|
Google Oneindia TeluguNews

Nadendla Manohar
హైదరాబాద్: కాంగ్రెసు శానససభ్యుడు చిరంజీవి పార్టీ నాయకులకు ఇచ్చిన టీ పార్టీని వివాదం చేయడానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌కు చెందిన సాక్షి దినపత్రిక వివాదం చేయాలని చూస్తున్నట్లు కనిపిస్తోంది. కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్, ఇతర పార్టీ నాయకులు హాజరైన చిరంజీవి అల్పాహార విందుకు స్పీకర్ హాజరయ్యారంటూ సాక్షి దినపత్రిక శనివారం ఓ వార్తాకథనాన్ని ప్రచురించింది. వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులపై అనర్హత వేటు వేసే విషయంపై, ఉప ఎన్నికలపై ఈ అల్పాహార విందు సమావేశంలో చర్చించినట్లు ఆ పత్రిక రాసింది. విందు భేటీకి నాదెండ్ల మనోహర్ హాజరు కావడం చర్చనీయాంశమైందని ఆ పత్రిక వ్యాఖ్యానించింది.

ఉప ఎన్నికలను ఎదుర్కోలేకనే జగన్ వర్గం శాసనసభ్యులపై అనర్హత వేటు వేసే విషయంలో ఆధికార కాంగ్రెసు పార్టీ వ్యూహాత్మకంగా జాప్యం చేయిస్తుందని అనుమానాలకు విందు సమావేశానికి నాదెండ్ల మనోహర్ హాజరు కావడం వల్ల బలం చేకూరుతుందని కూడా సాక్షి దినపత్రిక అభిప్రాయపడింది. విందు సమావేశంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివ రావు మినహా మిగతా సమన్వయ కమిటీ సభ్యులు, పార్లమెంటు సభ్యుడు కెవిపి రామచందర్ రావు చిరంజీవి ఇచ్చిన విందు సమావేశంలో పాల్గొన్నారు. గురు, శుక్రవారాల్లో జరిగిన భేటీల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రభావంపై, జగన్ చేస్తున ఓదార్పు యాత్రల ప్రభావంపై ఆజాద్ దృష్టి సారించినట్లు చెబుతున్నారు. జగన్‌ను దీటుగా ఎదుర్కోవాలని పార్టీ నాయకులకు సూచించినట్లు కూడా చెబుతున్నారు.

English summary
YSR Congress party president YS Jagan's Sakshi daily is trying to controversy on assembly speaker Nadendla Manohar presence in Chiru's tea party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X