• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రజనీ అల్లుడా, అందుకే..: కొలవెరిపై బాల మురళీకృష్ణ

By Pratap
|
Balamurali Krishna
బెంగళూరు: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడు ధనుష్‌కు చెందిన కొలవెరి డీపై ప్రముఖ సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాల మురళీకృష్ణ గమ్మత్తయిన వ్యాఖ్య చేశారు. ఆ పాట ప్రపంచాన్ని ఊపేస్తుంటే తాను మాత్రం దాన్ని వినలేదని ఆయన చెప్పారు. ఇంటర్నెట్ ద్వారా దేశవిదేశాల్లో కొలవెరి పాట త్వరగా ఆదరణ పొందిన విషయాన్ని బాలమురళీకృష్ణతో ప్రస్తావించగా, "నాకు తెలియదు. నేనెన్నడూ వినలేదు. అదెంతో బాగుంటేనే.. మీరు ప్రస్తావించి ఉంటారు'' అని వ్యాఖ్యానించారు.

ప్రముఖ నటుడు రజనీకాంత్ అల్లుడు ధనుష్ ఈ పాట పాడారని చెప్పగా, "రజనీకాంత్ అల్లుడా.. అందుకే పాపులరైంది'' అని స్పందించారు. ఆ వెంటనే సర్దుకుని "అందులో ఏదో ఉండే ఉంటుంది'' అని ముక్తాయించారు. వైద్యవిధానంలో సంగీతచికిత్సపై తనకు పూర్తి నమ్మకం ఉందన్నారు. కొంతమందిపై వారికి తెలియకుండానే ఈ విధానాన్ని వాడగా.. సత్ఫలితం కనిపించిందని చెప్పారు. శనివారం జరిగే సంగీత కార్యక్రమంలో పాల్గొనేందుకు బాలమురళీకృష్ణ ఇక్కడకు వచ్చారు.

English summary
Prominent musician Balamurali Krishna said that he is not aware of Dhanush's Kolaveri.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X