వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉత్సాహంగా ఉంటే లేటెందుకు?: బాలయ్యకు కాంగ్రెస్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Balakrishna
హైదరాబాద్: సినీ హీరో బాలకృష్ణకు రాజకీయాల్లోకి రావాలనే ఉత్సాహం అంతగా ఉంటే ఇంకా ఆలస్యమెందుకని, వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత రుద్రరాజు పద్మరాజు ఆదివారం సూచించారు. బాలయ్యకు అంతగా ఉత్సాహం ఉంటే ఉప ఎన్నికల్లో పోటీ చేసి సత్తా చూపించుకోవాలని సవాల్ విసిరారు. ప్రజాకర్షణ ఉన్న బాలయ్యకు ఉప ఎన్నికలే అసలైన వేదిక అన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు రాజకీయ భిక్ష పెట్టిందే కాంగ్రెసు పార్టీ అన్నారు. ఉప ఎన్నికల్లో టిడిపికి డిపాజిట్ కూడా రాదన్నారు. కాంగ్రెసు ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించిన బాబుకు అదే కాంగ్రెసును దూషించే అర్హత లేదన్నారు.

ఉప ఎన్నికల్లో పోటీ చేసి బాలయ్య తన జనాకర్షణ నిరూపించుకోవాలని శాసనమండలి సభ్యుడు రంగారెడ్డి అన్నారు. తెలుగుదేశం పార్టీని బాబు బతికించలేరని అర్థమైపోయిందని అందుకే బాలయ్య ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నారని విమర్శించారు. మహానేత ఎన్టీఆర్‌నే ఓడించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెసు పార్టీకి బాలయ్య ఏమాత్రం పోటీ కాదన్నారు. కాగా కృష్ణా జిల్లా పర్యటనలో బాలకృష్ణ తాను త్వరలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని, 2014 ఎన్నికల్లో పోటీ చేస్తానని, అప్పుడు టిడిపియే అధికారంలోకి వస్తుందని స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

English summary
Congress Party leader Rudraraju Padmaraju and MLC Ranga Reddy challenged Hero Balakrishna to contest in Telangana bypoll.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X