వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

యాత్రతో ఏంసాధించారు?: చంద్రబాబుకు మాజీ డిజిపి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Telangana Map
హైదరాబాద్: ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడతాయని, మీ పర్యటన రద్దు చేసుకోవాలని వరంగల్ జిల్లా ఎస్పీ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు లేఖ రాసినప్పటికీ ఆయన వరంగల్ జిల్లాలో రైతు పోరు యాత్ర చేసి ఏం సాధించారని మాజీ డిజిపి పేర్వారం రాములు ఆదివారం ప్రశ్నించారు. చంద్రబాబు తీరు ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఉందన్నారు. తెలంగాణ ప్రజల సహనాన్ని ఎవరూ పరీక్షించవద్దనన్నారు. 1969నాటి పరిస్థితులు ఏర్పడితే ప్రభుత్వమే దానికి బాధ్యత వహించవలసి ఉంటుందన్నారు. వేలమందితో పోలీసులతో యాత్ర చేయడమేమిటన్నారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వం అచేతనంగా ఉండటం సరికాదన్నారు. బాబు యాత్ర ఫిరంగితో పిట్టల్ని కాల్చినట్లుగా ఉందని విమర్శించారు.

రెండు ప్రాంతాల ప్రజలు రాష్ట్ర విభజనను కోరుకుంటున్నారని ఆయన చెప్పారు. కొందరు రాజకీయ నాయకులే రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. గొప్ప రాజకీయ నాయకులు అనుకునే వారు ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని సూచించారు. కాగా రెండు రోజుల క్రితం టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు వరంగల్ జిల్లాలో రైతు పోరు బాట యాత్ర నిర్వహించిన విషయం తెలిసిందే. బాబు పోరు బాట ఉద్రిక్తతకు దారి తీసింది.

English summary
Former DGP Pervaram Ramulu questioned TDP chief Nara Chandrababu Naidu about his Warangal yatra. What Chandrababu gain with Yatra, asked Ramulu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X