నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అంబటిపై యెల్లో మీడియా అసత్య ప్రచారం: కోటంరెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

kotamreddy sridhar reddy
నెల్లూరు: తమ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబుపై యెల్లో మీడియా అసత్య ప్రచారం చేస్తోందని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆదివారం అన్నారు. ఇలాంటి అసత్య ప్రచారం మానుకోకుంటే ప్రజలే వారికి గట్టిగా బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీకి ఉరి తీసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. జగన్ అభ్యర్థులు ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొందటం ఖాయమన్నారు. కాగా పార్టీని ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేస్తున్న మహా పాదయాత్రకు బ్రేక్ పడింది.

పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కోటంరెడ్డి తన మహాపాదయాత్రకు బ్రేక్ వేశారు. త్వరలో జరగనున్న కృష్ణా జిల్లా మున్సిపల్ ఎన్నికలకు కోటంరెడ్డిని పరిశీలకుడిగా వెళ్లాలని జగన్ ఆదేశించారు. అనంతరం తిరిగి వచ్చాక మళ్లీ జనవరి 21వ తేది నుండి మహా పాదయాత్ర ప్రారంభమవుతుంది. కాగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గత కొన్ని రోజులుగా జిల్లాలో పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే.

English summary
YSR Congress Party leader Kotamreddy 
 
 Sridhar Reddy condemned allegations on 
 
 party spokes person Ambati Rambabu. He 
 
 give break to his maha padayatra by MP 
 
 Jagan orders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X