వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబు, లగడపాటిల్లో మార్పు: తెలంగాణపై బాపూజీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Konda Laxman Bapuji
హైదరాబాద్: తెలంగాణపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్‌ల్లో కొంత మార్పు వచ్చిందని తెలంగాణ స్వాతంత్ర్య సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఏర్పాటు చేస్తామని పార్లమెంటు సాక్షిగా ప్రజలకిచ్చిన హామీకి కట్టుబడి ఉన్నారా, లేదా అనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయాలని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో డిమాండ్ చేశారు. నివేదికలు, చర్చలు అంటూ కాలయాపన చేస్తే ప్రజాస్వామ్యంపై నమ్మకం పోతుందని ఆయన అన్నారు. తెలంగాణకు వ్యతిరేకం కాదంటున్న చంద్రబాబు అనుకూలంగా ప్రకటన చేయాలని ఆయన కోరారు. సమైక్యాంధ్ర అంటున్న లగడపాటిలో కూడా మార్పు వచ్చిందని ఆయన అన్నారు. పరిపాలనా సౌలభ్యం కోసం చిన్న రాష్ట్రాలు అవసరమని ఈ రోజు లగడపాటి చేసిన ప్రకటన ఇందుకు నిదర్శనమని ఆయన అన్నారు.

తెలంగాణ వస్తే తమ ద్వారా మాత్రమే రావాలనే తత్వంతో ఒక చిన్న పార్టీ పేచీ పెడుతోందని ఆయన తెలంగాణ రాష్ట్ర సమితిని ఉద్దేశించి అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు అధినేత వైయస్ జగన్ యువకుడు అయినందున తొందరపాటుతో వ్యవహరిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణపై స్పష్టమైన ప్రకటన చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పార్టీల ప్రయోజనాలు తప్ప చిత్తశుద్ధి లేకపోవడమే తెలంగాణకు ప్రధాన ఆటంకమవుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. మూడు ప్రాంతాల ప్రజలను రెచ్చగొట్టే చర్యలను ఆపాలని ఆయా ప్రాంతాల నాయకులను ఆయన కోరారు. ప్రజల ఆకాంక్ష మేరకు ఈ నెల 11వ తేదీన గాంధీభవన్ ప్రకాశం హాల్లో మూడు ప్రాంతాల నాయకులను కలిపి సద్భావనా సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. శాంతియుతంగా విడిపోయేందుకు అనుసరించాల్సిన విధానాలపై చర్చిస్తామని ఆయన చెప్పారు.

English summary
Telangana freedom fighter Konda Laxman Bapuji has seen change in TDP president N Chandrababu Naidu and Congress MP Lagadapati rajagopal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X