వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భగవద్గీతపై ప్రమాణం చేసి ఎన్నారై బాధ్యతలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Bhagavad Gita
వాషింగ్టన్: కౌన్సిల్‌గా బాధ్యతలు చేపట్టే సమయంలో ఓ ప్రవాస భారతీయుడు భగవద్గీతపై ప్రమాణం చేశారు. వైద్యుడిగా పని చేస్తున్న సుధాంశ్ ప్రసాద్ న్యూజెర్సీ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయన ఆదివారం బాధ్యతలు తీసుకున్నారు. ఈ సమయంలో అతను భారతీయ ఆధ్యాత్మిక గ్రంథం భగవద్గీతపై ప్రమాణం చేసి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. చిన్నతనం నుంచి భగవద్గీతను మనసా, వాచా, కర్మణా నమ్ముతానని చెప్పారు. అందువల్లే ఆ గ్రంథంపై ప్రమాణం చేసినట్లు చెప్పారు. ప్రజలకు మరింత మెరుగైన వసతులు కల్పిస్తామని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆస్తి పన్ను వసూలు కూడా సమప్రాధాన్యమిస్తామన్నారు.

గతేడాది నవంబర్‌లో పురపాలక అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన ప్రసాద్ ఈ పదవిని రెండోసారి చెపట్టారు. బీహార్ రాజధాని పాట్నా నగరం ప్రసాద్ స్వస్థలం. ఎడిసన్‌లోని జెఎఫ్‌కె ఆసుపత్రిలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ మెడిసన్‌కు గతంలో చైర్మన్‌గా వ్యవహరించారు. ఇటీవల భగవద్గీత తీవ్రవాదాన్ని ప్రేరేపించే విధంగా ఉందని రష్యాలో ఓ వ్యక్తి కోర్టులో కేసు వేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై వాదోపవాదాలు జరిగిన తర్వాత గత డిసెంబర్ 28న కోర్టు కేసును కొట్టి వేసింది.

English summary
NRI Sudamsh Prasad promised on Bhagavad Gita when he swearing as new jersey council president.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X