హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాజకీయం: బాబు జగన్ టూర్లపై కోదండరామ్, బాపూజీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kodandaram
హైదరాబాద్/నల్గొండ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ యాత్రలపై తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్, ప్రముఖ స్వతంత్ర సమర యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ పరోక్షంగా మండిపడ్డారు. తెలంగాణ పట్ల ఏ పార్టీకి చిత్తశుద్ధి లేదని కొండా లక్ష్మణ్ అన్నారు. రాజకీయ పార్టీలు ఏవైనా ఆందోళనలు తెలంగాణలో రాజకీయ ప్రాధాన్యత కోసమేనన్నారు. తెలంగాణలోని రాజకీయ పార్టీలకు తెలంగాణ పట్ల చిత్తశుద్ధి లేదన్నారు. జై ఆంధ్ర వంటి ఉద్యమం వస్తేనే తెలంగాణ సాధించగలుగుతామన్నారు.

మంత్రుల చేతకానితనం వల్లనే తెలంగాణ ప్రజలపై పోలీసులు దౌర్జన్యాలు చేస్తున్నారని కోదండరామ్ వేరుగా నల్గొండ జిల్లాలో అన్నారు. జగన్, చంద్రబాబు ఇలా సీమాంధ్రకు చెందిన అందరు నేతలు ఒక్కటై తెలంగాణవాదం లేదని నిరూపించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. సంపన్న వర్గాల ఆధిపత్యం వల్లే తెలంగాణ వెనుకబాటుకు గురవుతోందన్నారు. తెలంగాణ ఉద్యమం బలమైన శక్తిగా ఎదగడంతో ప్రపంచస్థాయిలో తెలంగాణ అంశం బలపడిందన్నారు. ఉద్యమ రూపంలో విద్యార్థులు మరింత బలమైన శక్తిగా మారాలన్నారు.

English summary
JAC chairman Kodandaram and Konda Laxman Bapuji opposed YS Jaganmohan Reddy and Chandrababu Naidu tour in Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X