విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తిరుమలపై మరోసారి చినజీయర్ సంచలన వ్యాఖ్యలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chinna Jeeyar Swamy
విజయవాడ: తిరుమల విషయంలో చిన జీయర్ స్వామి బుధవారం మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కృష్ణా జిల్లా విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న చిన జీయర్ స్వామి టిటిడి, ప్రభుత్వాల తీరుపై విమర్శలు గుప్పించారు. తిరుమలలో అన్ని ఉల్లంఘనలే జరుగుతున్నాయన్నారు. సౌకర్యాలు, భద్రత, పెద్దల పేరుతో నియమాలు ఉల్లంఘించడం న్యాయం కాదన్నారు. దేహం చాలిస్తే కొండపై ఎలాంటి సంస్కారాలు చేయవద్దని, శేషాచలవాసుడు అందుకు అంగీకరించడన్నారు. నియమాలు ఉల్లంఘించడమంటే దేవుడిని అవమానించడమేనని ఆగ్రహించారు. ఇలాంటి ఉల్లంఘనలకు క్షమించాలని శరణాగత దీక్షలో దేవుడిని కోరదామన్నారు. ఫిబ్రవరి మూడో తేదిన కొండపైకి నడుచుకుంటూ వెళతానని చెప్పారు.

కాగా చిన జీయర్ స్వామి శిష్యులు అహోబిళ స్వామి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. తిరుమలపై ప్రభుత్వానిది భస్మాసుర హస్తమన్నారు. శ్రీవారికి విశ్రాంతి ఇవ్వకుండా దర్శనాలు చేయించడం సరికాదన్నారు. మూసిన తలుపులు తెరిచి దర్శనాలు చేయించడం శోచనీయమన్నారు. కాగా ఇటీవల చిన జీయర్ స్వామి తిరుమలకు వెళితే పబ్‌కు వెళ్లినట్లుగా ఉన్నదని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలపై అప్పుడు పలువురు మండిపడ్డారు.

English summary
Chinna Jeeyar Swamy make controversial comments on Tirumala again today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X