హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మార్కులు కొట్టేసేందుకు జగన్‌పై విమర్శలు: శ్రీధర్‌పై గోనె

By Srinivas
|
Google Oneindia TeluguNews

Gone Prakash Rao
హైదారాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డిని తెలంగాణ ప్రజలు నమ్మే స్థితిలో లేరన్న మంత్రి శ్రీధర్ బాబుపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత గోనె ప్రకాశ రావు బుధవారం మండిపడ్డారు. కాంగ్రెసు అధిష్టానం, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వద్ద మార్కులు కొట్టేసేందుకే జగన్‌పై శ్రీధర్ బాబు విమర్శలు చేస్తున్నారన్నారు. తెలంగాణ కోసం రాజీనామా చేస్తానని చెప్పి మాటమార్చినందుకు ముందు పదవిని త్యజించి ఇతరుల గురించి మాట్లాడాలని సూచించారు. తెలంగాణకు అనుకూలంగా లేని కిరణ్, సీమాంధ్ర నేతలను కరీంనగర్ జిల్లాకు తీసుకు వెళ్లావని విమర్శించారు. తెలంగాణ ఉద్యమం తీవ్రంగా ఉన్న సమయంలో ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వెళ్లి తాము మాజీ మంత్రులుగా వచ్చామని చెప్పిన నీవు మళ్లీ మంత్రిగా ఎలా కొనసాగుతున్నావని ప్రశ్నించారు.

నీతో పాటు ఓయుకు వచ్చిన జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రాజీనామా చేయగా నీవెలా కొనసాగుతున్నావన్నారు. తెలంగాణ అంశంలో మాట మార్చింది మీరేనని విమర్శించారు. తెలంగాణ సెంటిమెంట్ వాడుకోవడం కాంగ్రెసుకు మొదటి నుండి అలవాటన్నారు. తెలంగాణ ఇవ్వబోమని కేంద్రం చెబితే తాను ఏం చేస్తారో శ్రీధర్ బాబు ప్రజలకు జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ విషయంలో కాంగ్రెసే మొదటి ముద్దాయి అన్నారు.

English summary
YSR Congress Party leader Gone Prakash Rao fired at Sridhar Babu for his comments on YS Jaganmohan Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X