హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెరాస, టిడిపి బండారం బయటపడ్తుంది: ముత్యంరెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Muthyam Reddy
హైదరాబాద్: 2009లో తెలంగాణ రాష్ట్ర సమితి, తెలుగుదేశం పార్టీ బేరసారాలపై సిబిఐ విచారణ జరిపించాలని కాంగ్రెసు శాసనసభ్యుడు ముత్యం రెడ్డి శుక్రవారం డిమాండ్ చేశారు. అప్పటి సాధారణ ఎన్నికలలో టిడిపి ఎంత ముట్టజెప్పి టిఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకుందో చెప్పాలని డిమాండ్ చేశారు. సిబిఐ విచారణ జరిపితే ఆ పార్టీల బండారం బయటపడుతుందన్నారు. రాజకీయ నాయకుల ఆస్తులపై సిబిఐ విచారణ జరగాలన్నారు. అవసరమైతే తన ఆస్తులపై కూడా విచారణకు సిద్ధమన్నారు. ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ గెలిస్తే తెలంగాణ వస్తుందా అని ప్రశ్నించారు. తన రాజీనామా వల్ల తెలంగాణ రాదన్నారు. టిఆర్ఎస్‌కు కాంగ్రెసును విమర్శించే అర్హత లేదన్నారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నప్పుడు ఆ పార్టీ ఎంపీలు కెసిఆర్, విజయశాంతిలు ఎక్కడున్నారని ప్రశ్నించారు. సభకు హాజరు కాని వాళ్లు కాంగ్రెసుపై నోరుపారేసుకోవద్దన్నారు.

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఓ మాట ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరో పాట పాడుతున్నారన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఉచిత విద్యుత్ ఇవ్వాలని తాము ఆయనను కోరితే కుదరదని చెప్పారన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపిస్తున్నారన్నారు. తక్కువ ఖర్చుతో వ్యవసాయం మా నియోజకవర్గంలో చేశామన్నారు.

English summary
Congress MLA Muthyam Reddy demanded for CBI enquiry on TDP and TRS alliance in 2009 general elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X