హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చైతన్యపురి సిఐ ప్రవీణ్ రెడ్డి అరెస్టు, రివాల్వర్ స్వాధీనం

By Pratap
|
Google Oneindia TeluguNews

Charminar
హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో పరారీలో ఉన్న హైదరాబాదులోని చైతన్య పురి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ప్రవీణ్‌రెడ్డిని శనివారం ఉదయం అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) అధికారులు అరెస్టు చేశారు. పది రోజుల క్రితం హైరాబాదులోని ఎర్రమంజిల్‌లో గల ప్రవీణ్‌రెడ్డి ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేసి రూ. 2.25 కోట్ల అక్రమాస్తులను గుర్తించారు. అప్పటి నుంచి విధుల్లోకి రాకుండా ప్రవీణ్‌రెడ్డి పరారీలో ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసులో మొదట ప్రవీణ్‌రెడ్డి తండ్రి బుచ్చారెడ్డిని అధికారులు అరెస్ట్ చేశారు.

విధులకు రాకపోవడంతో ప్రవీణ్ రెడ్డి సస్పెన్షన్‌కు కూడా గురయ్యారు. ప్రవీణ్ రెడ్డి నుంచి ఎసిబి అధికారులు రివాల్వర్‌ను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం రాత్రే ప్రవీణ్ రెడ్డిని ఎసిబి అధికారులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. అయితే, శనివారం ఉదయం ఆయన అరెస్టును వారు ధ్రువీకరించారు. ఆదాయానికి మించి అస్తులు కలిగి ఉన్న కేసులో ఎసిబికి పట్టుబడి, అరెస్టయిన రంగారెడ్డి జిల్లా ఒఎస్‌డి సర్వేశ్వర్ రెడ్డికి ప్రవీణ్ రెడ్డి అత్యంత సన్నిహితుడు.

English summary
Chaitnayapuri CI Praveen Reddy arrested by ACB after 10 days of absconding.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X