హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు చల్లగాలులు

By Pratap
|
Google Oneindia TeluguNews

Andhrapradesh Map
హైదరాబాద్: ఉత్తరాది ప్రభావంతో రాష్ట్రంలో కొద్ది రోజులుగా చల్ల గాలులు వీస్తున్నాయి. ఉష్ణోగ్రతలు పడిపోయి ప్రజలు చలిపులికి గజగజ వణుకుతున్నారు. ఈ చల్లగాలుల ప్రభావం రాష్టంలో మరో రెండు రోజులు కొనసాగుతాయని వాతావరణ పరిశోధనా కార్యాలయం అధికారులు చెబుతున్నారు. ఆదిలాబాదు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో 4 డిగ్రీల కన్నా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ చలి కాలంలో అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు ఇవే.

రాష్ట్రంలో రాయలసీమ, కోస్తాంధ్ర, తెలంగాణ ప్రాంతాలన్నింటిలో చల్లగాలుల ప్రభావం ఉంటుందని వాతావరణ పరిశోధనా కార్యాలయం అధికారులు చెబుతున్నారు. తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లోని కొన్ని ప్రాంతాల్లో గణనీయంగా ఉష్ణోగ్రతలు పడిపోగా, కోస్తాంధ్రలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెద్ద యెత్తున పడిపోయాయి.

English summary
The Meteorological Department on Sunday warned of continuation of cold wave to severe cold wave conditions across the state for next two days.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X