వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'మహేష్ బాబు వస్తారనలేదు, కరివేపాకులా చూడం'

By Srinivas
|
Google Oneindia TeluguNews

Mahesh Babu
హైదరాబాద్: ప్రిన్స్ మహేష్ బాబు రాజకీయాల్లోకి వస్తారని తాను చెప్పలేదని శాసనమండలి సభ్యుడు రంగారెడ్డి సోమవారం ఓ టీవి ఛానల్ కార్యక్రమంలో చెప్పారు. హీరో సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు శేష గిరి రావు కాంగ్రెసు పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారని, మహేష్ వచ్చినా తగిన స్థానం కల్పిస్తామని మాత్రమే చెప్పానని రాజకీయాల్లోకి వస్తున్నారని మాత్రం తాను చెప్పలేదన్నారు. తెలుగుదేశం పార్టీ స్థాపించిన నందమూరి తారక రామారావు కూతురు దగ్గుపాటి పురంధేశ్వరి, దర్శకరత్న దాసరి నారాయణ రావులు కాంగ్రెసు పార్టీలోనే ఉన్నారని వారికి తగిన గౌరవం ఇచ్చి గౌరవించామే కానీ ఎవ్వరినీ కరివేపాకులా ఉపయోగించుకోలేదన్నారు. కరివేపాకులా వాడుకునే సంస్కృతి కాంగ్రెసుకు లేదన్నారు. పార్టీలోకి ఎవరు వచ్చిన సముచిత స్థానం కల్పిస్తామన్నారు.

ఈ నెల 19వ తేదిన మంత్రివర్గ విస్తరణ జరుగుతుందన్న అంశం గురించి తనకు తెలియదన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి తానొక్కడినే సన్నిహితుడను కానని ప్రతి కార్యకర్త సన్నిహితుడేనన్నారు. మంత్రివర్గ విస్తరణ అంశం ముఖ్యమంత్రి పరిధిలోనిదని ఆది ఆయనకే తెలుస్తుందన్నారు. కాగా ఇటీవల మహేష్ బాబు కాంగ్రెసులోకి వస్తున్నారని, లేదని జోరుగా ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. మహేష్ బాబును తీసుకు రావడానికి సిఎం కిరణ్ ప్రత్యేకంగా శ్రద్ధ చూపిస్తున్నారంటూ వార్తలు వచ్చాయి.

English summary
MLC Ranga Reddy said today in a tv channel program that he did not say about hero Mahesh Babu political entry.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X