వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్‌కు రాజా పరిస్థితే: మరోసారి ధ్వజమెత్తిన విహెచ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

V Hanumanth Rao
న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి హనుమంత రావు సోమవారం మరోసారి ధ్వజమెత్తారు. జగన్ అక్రమాలు ఒక్కటొక్కటిగా బయటకొస్తున్నాయన్నారు. క్రమంగా ఆయన నిజ స్వరూపం బయటపడుతుందన్నారు. రైతుల భూములు లాక్కున్న జగన్ ఇప్పుడు రైతు దీక్షలు చేస్తున్నాడని ఎద్దేవా చేశారు. ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాలన్నారు. జగన్‌తో సంబంధం ఉన్న వారిని ఎవరినీ సిబిఐ వదిలి పెట్టదన్నారు. బ్రదర్ అనిల్ కుమార్ సువార్త సభల్లోనూ రాజకీయ ప్రసంగాలు చేస్తున్నారని ఆరోపించారు. తన బావమరిది జగన్‌ను అందలమెక్కించేందుకు ఆయన మత సభలను వేదికగా ఉపయోగించుకుంటున్నారన్నారు. జగన్‌లాంటి వ్యక్తులను ప్రజలు దూరంగా పెట్టాలని సూచిస్తూ, అలా చేయకపోతే రాష్ట్రాన్నే దోచుకుంటాడని విమర్శించారు.

ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని విమర్శిస్తున్న సాక్షికి ఇబ్బడిముబ్బడిగా పత్రిక ప్రకటనలు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. గతంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి వాస్తవాలు రాస్తే దివంగత వైయస్ ఆ పత్రికలకు ప్రకటనలు ఆపు చేశారన్నారు. ఆయన తండ్రి ఏ పార్టీలో ఉండి కోట్లు సంపాదించారో ఆ పార్టీ అధినాయకత్వాన్ని విమర్శిస్తే సహించేది లేదన్నారు. అర్హతకు మించి ప్రకటనలు ఇచ్చే విషయమై సమన్వయ కమిటీలో చర్చకు వచ్చిందన్నారు. ప్రభుత్వాన్ని పడగొట్టాలనుకునే వారికి ప్రకటనలు ఎలా ఇస్తారన్నారు. కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి అరెస్టైనప్పుడు ఆయన గురించి ప్రశ్నిస్తే ఆయన బిజెపి నేత, తనకేం సంబంధమని బుకాయించాడని, కానీ గాలికి చెందిన ఆర్ ఆర్ గోల్డ్ తదితర కంపెనీలు జగన్‌కు చెందిన సాక్షిలో పెట్టుబడులు పెట్టినట్లు బయటపడిందన్నారు.

రాష్ట్రానికి సిఎం కావాలనుకుంటున్న వ్యక్తి అబద్దాలాడటం దారుణమన్నారు. సిబిఐ విచారణలో గాలి, జగన్ సంబంధాలు బయటపడ్డాయన్నారు. జగన్‌పై ప్రభుత్వం సిబిఐ విచారణకు ఆదేశించలేదని, ఆయనే సవాళ్లు విసిరి మరీ వేయించుకున్నారన్నారు. దమ్ముంటే జగన్‌పై సిబిఐ విచారణ వేయాలన్న ఆయన అనుచరులు ఇప్పుడు విమర్శలు చేయడమేమిటన్నారు. 2004లో జగన్ ఆస్తి ఎంత ఆ తర్వాత ఎంత అనే విషయమై రాష్ట్రం మొత్తం తిరిగి ప్రచారం చేస్తానన్నారు. తండ్రికి అధికారం ఇచ్చినప్పుడే కోట్లు కొల్లగొట్టిన వ్యక్తి ఇప్పుడు తనకు అవకాశం ఇవ్వమంటున్నాడని విమర్శించారు. జగన్ పరిస్థితి కూడా రాజా, సురేష్ కల్మాడీల వలె తయారవుతుందన్నారు.

English summary
Congress senior leader V Hanumanth Rao fired at YSR Congress Party chief YS Jaganmohan Reddy today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X