వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సోనియా పోస్టర్‌పై నల్ల రంగు, బాబాపై సిరాకు కౌంటర్

By Pratap
|
Google Oneindia TeluguNews

Sonia Gandhi
న్యూఢిల్లీ: ఢిల్లీనలోని 24 అక్బర్ రోడ్డులో గల కాంగ్రెసు కేంద్ర కార్యాలయం వద్ద ఉన్న సోనియా గాంధీ పోస్టర్‌పై ఓ ఆగంతకుడు సిరా పోశాడు. ఈ సంఘటన సోమవారం సాయంత్రం జరిగింది. సోనియా పోస్టర్‌పై సిరా పోసిన వ్యక్తిని ఢిల్లీకి చెందిన త్రిభువన్‌గా గుర్తించారు. ఇటీవల యోగా గురు రామ్‌దేవ్‌పై ఓ వ్యక్తి సిరాతో దాడి చేసినందుకు ప్రతీకారంగానే త్రిభువన్ సోనియా పోస్టర్‌పై సిరా పోసినట్లు అనుమానిస్తున్నారు. మత గురువును అవమానపరిస్తే సహించేది లేదని అతను నినాదాలు చేశాడు.

సోనియా పోస్టరుపై సిరా పోసిన వ్యక్తిని అక్కడ ఉన్న కాంగ్రెసు కార్యకర్తలు చితకబాదారు. ఐదు రాష్ట్రాలకు జరుగుతున్న ఎన్నికల్లో టికెట్లు ఆశిస్తున్నవారు పార్టీ కార్యాలయం వద్ద పెద్ద యెత్తున చేరారు. ఈ సమయంలో త్రిభువన్ సోనియా పోస్టరుపై సిరా పోశాడు. ఆ వెంటనే రామ్‌దేవ్ అనుచరులు కూడా అక్కడికి వచ్చారు. దీంతో కాంగ్రెసు కార్యకర్తలకు, రామ్‌దేవ్ అనుచరులకు మధ్య ఘర్షణ చెలరేగింది. త్రిభువన్‌ను పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు.

English summary
On Monday evening, a supporter of Baba Ramdev threw ink on the poster of Sonia Gandhi outside Congress Headquarters at 24 Akbar Road.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X