వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్ ప్రధానికి సుప్రీంకోర్టు ధిక్కార నోటీసు జారీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Yousuf Raza Gilani
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రధాని యూసుఫ్ రజా గిలానీకి సుప్రీంకోర్టు సోమవారం కోర్టు ధిక్కారం నోటీసును జారీ చేసింది. అవినీతి కేసులను పునరుద్ధరించుకపోవడంపై సుప్రీంకోర్టు ఈ నోటీసు జారీ చేసింది. దీంతో పాకిస్తాన్ పౌర ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగనట్లయింది. తన ఆదేశాలను పాటించకపోవడంపై సుప్రీంకోర్టు గిలానీకి కోర్టు ధిక్కార నోటీసు ఇచ్చింది. పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీపై అవినీతి కేసులను పునరుద్ధరించాలని గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయంపై వ్యక్తిగతంగా ఈ నెల 19వ తేదీన తమ ముందు హాజరు కావాలని సుప్రీంకోర్టు గిలానీని ఆదేశించింది.

జర్దారీపై పాత కేసులను తిరిగి తెరవాలని స్విస్ అదికారులను కోరుతూ లేఖ రాయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అందుకు ప్రభుత్వం నిరాకరించింది. తాజా పరిణామంతో జర్దారీ కూడా చిక్కుల్లో పడినట్లయింది. ఆల్ ఖైదా వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్ హత్య తర్వాత తనపై జరుగుతున్న కుట్రను ఆపించాలని జర్దారీ అమెరికాను కోరుతూ ఓ లేఖ రాసినట్లు వెల్లడైంది. దీనిపై సైన్యం, ఐఎస్ఐ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఆ రహస్య మెమోపై వాషింగ్డన్ రాయబారిగా జర్దారీ సన్నిహితుడు హుస్సేన్ హక్కానీ రాజీనామా చేయాల్సి వచ్చింది.

English summary
Pakistan's top court on Monday found Prime Minister Yousuf Raza Gilani in contempt for not complying with orders related to re-opening corruption cases and summoned him to appear in person this week.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X