వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజీనామాకు సిద్ధపడిన పాకిస్తాన్ ప్రధాని గిలానీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Yousuf Raza Gilani
ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లో సంక్షోభం అంతకంతకూ ముదురుతోంది. పాకిస్తాన్ ప్రధాని యూసుఫ్ రజా గిలానీ రాజీనామాకు సిద్ధపడ్డారు. సుప్రీంకోర్టు ధిక్కరణ నోటీసును జారీ చేసిన తర్వాత ఆయన అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీని కలిశారు. అధ్యక్షుడు డిమాండ్ చేస్తే తాను రాజీనామా చేస్తానని జర్దారీతో భేటీ తర్వాత గిలానీ మీడియా ప్రతినిధులతో చెప్పారు. సంకీర్ణ భాగస్వామ్య పక్షాల పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొంటారు.

దేశంలోని ఇతర వ్యవస్థలతో ఘర్షణ కూడదని రాజకీయ నాయకులు గిలానీకి సలహా ఇస్తున్నట్లు డాన్ న్యూస్ అంటోంది. సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించాలని, అలాగే జనవరి 19వ తేదీన సుప్రీంకోర్టు ముందు హాజరు కావాలని వారు సూచిస్తున్నట్లు డాన్ న్యూస్ వార్తాకథనాలు తెలియజేస్తున్నాయి. మనుగడ కోసం ప్రభుత్వం పెడుతున్న కృషికి సుప్రీంకోర్టు ఆదేశాలు విఘాతం కలిగించేట్లున్నాయని భావిస్తున్నారు. గిలానీకి ధిక్కరణ నోటీసు జారీ చేసినప్పటికీ కోర్టు అసలు లక్ష్యం జర్దారీ అని వ్యాఖ్యానిస్తున్నారు.

English summary
Pakistan's Prime Minister Yousuf Raza Gilani on Monday offered to resign, hours after being served a contempt notice by the Supreme Court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X