వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నెగ్గిన చిరంజీవి: బెడిసికొట్టిన కిరణ్ కుమార్ రెడ్డి వ్యూహం

By Pratap
|
Google Oneindia TeluguNews

Chiranjeevi-Kiran Kumar Reddy
న్యూఢిల్లీ: మంత్రి వర్గం విస్తరణ క్రీడలో చివరికి మెగాస్టార్ చిరంజీవి నెగ్గారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యూహం బెడిసి కొట్టింది. పిసిసి బొత్స సత్యనారాయణకు కళ్లెం వేయాలని కిరణ్ కుమార్ రెడ్డి చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. చిరంజీవి వర్గానికి చెందిన ఇద్దరితో పాటు మరో ముగ్గురిని మంత్రి వర్గంలోకి తీసుకోవాలని, ముగ్గురు పాత మంత్రులకు ఉద్వాసన పలకాలని కిరణ్ కుమార్ రెడ్డి వ్యూహరచన చేశారు. అందుకు అధిష్టానాన్ని ఒప్పించడానికి ప్రయత్నించారు. అయితే, అధిష్టానం అంగీకరించినట్లే అంగీకరించి చివరి నిమిషంలో తిప్పికొట్టింది. పైగా, మంత్రి వర్గ విస్తరణను చిరంజీవి చెప్పినట్లుగా 19వ తేదీన కాకుండా 23వ తేదీన చేపట్టాలని కూడా ముఖ్యమంత్రి భావించినట్లు వార్తలు వచ్చాయి. తద్వారా 19వ తేదీన మంత్రి వర్గ విస్తరణ జరుగుతుందనే చిరంజీవి మాటలు చెల్లలేదని అనిపించాలని ముఖ్యమంత్రి భావించినట్లు చెబుతారు.

మంత్రి వర్గ విస్తరణ లక్ష్యాన్ని సాధించుకోవడానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి చేరుకోవడానికి ముందే పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఢిల్లీకి చేరుకున్నారు. ముఖ్యమంత్రి వ్యూహానికి ఆయన ప్రతివ్యూహం రచించి అమలు చేశారని అంటున్నారు. రేపు 19వ తేదీన ప్రజారాజ్యం పార్టీకి చెందిన ఇద్దరికి మాత్రమే మంత్రి వర్గ విస్తరణకు అధిష్టానం అనుమతి ఇవ్వడంతో బొత్స సత్యనారాయణ శిబిరంలో ఆనందం చోటు చేసుకుంది. మంత్రి పదవుల కోసం ఢిల్లీకి క్యూ కట్టిన కాంగ్రెసు శాసనసభ్యులు బుధవారం తిరుగు ముఖం పట్టారు.

ముఖ్యమంత్రికి కాస్తా ఊరట కలిగించే విషయం - పి. శంకరరావుకు ఉద్వాసన పలకడానికి అధిష్టానం అనుమతి ఇచ్చిందనే వార్త మాత్రమే. శంకరరావును మంత్రి వర్గం నుంచి తొలగిస్తే తెలంగాణ నుంచి మూడు మంత్రి పదవులు ఖాళీ అయినట్లు అవుతుంది. వీటి భర్తీ పేరుతో తనదైన మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్యమంత్రి ప్రయత్నించారు. జూపల్లి కృష్ణారావు మంత్రి పదవికి, పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఇవి ఇప్పట్లో భార్తీ అయ్యే సూచనలు కనిపించడం లేదు. పైగా, రామచంద్రయ్యను మంత్రి వర్గంలోకి తీసుకోవడంతో బొత్స వర్గం బలపడుతుందని అంటున్నారు. ఇది ముఖ్యమంత్రికి అంత సానుకూలమైన విషయం కాదు. ఏమైనా, కిరణ్ కుమార్ రెడ్డి వ్యూహం దెబ్బ తిన్నదని అంటున్నారు.

English summary
CM Kiran kumar Reddy's strategy regarding cabinet expansion has failed and Chiranjeevi has got upper hand.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X