హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మా సంగతి చూడండి!: చిరంజీవికి ఎమ్మెల్యేల విజ్ఞప్తి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్: తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవే తమకు అధిష్టానం అని ఆయన వర్గానికి చెందిన తూర్పు గోదావరి జిల్లా ఎమ్మెల్యేలు బుధవారం స్పష్టం చేశారు. శాసనమండలి సభ్యుడు సి.రామచంద్రయ్య, శాసనసభ్యుడు గంటా శ్రీనివాస రావులకు మంత్రివర్గంలో చోటు కల్పించడంపై చిరు వర్గానికి పలువురు ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లా ఎమ్మెల్యేలు వంగా గీత, గాంధీ మోహన్, కన్నబాబు తదితరులు చిరంజీవితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు తూర్పు గోదావరి జిల్లాలో పిఆర్పీకి మంచి బలం ఉందని, తమ విషయం కూడా చూడాలని వారు చిరుకు విజ్ఞప్తి చేశారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. తమకు చిరంజీవి హైకమాండ్ అని చెప్పారు. ఆయన మాటకు కట్టుబడి ఉంటామన్నారు. పార్టీలో తమకూ ప్రాధాన్యత కల్పించాలని కోరడంలో తప్పేమిటని వారు అన్నారు. తమకు ఎలాంటి అసంతృప్తి లేదన్నారు.

మంగళవారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని తాను కలవడం కాకతాళీయమేనని మరో ఎమ్మెల్యే వంగా గీత చెప్పారు. మిగిలిన నేతలకు పదవులు ఇవ్వడంపై తమకు ఎలాంటి అసంతృప్తి లేదని తమ భవిష్యత్తు పైనే అడిగినట్లు వారు చెప్పారు. కాగా ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లే ముందు వంగా గీత తదితరులు ఆయన క్యాంప్ కార్యాలయంలో కలుసుకోవడం చర్చానీయాంశమైన విషయం తెలిసిందే. మంత్రి వర్గంలో స్థానం కోరేందుకే వారు కలిశారనే ప్రచారం జరిగింది. కానీ చిరు వర్గం నేతలు దానిని కొట్టి పారేశారు.

English summary
PRP mlas appealed Tirupati MLA Chiranjeevi about their posts. Vanga Geetha, Kanna Babu and Gandhi Mohan met Chiranjeevi today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X