హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మంత్రి వర్గ విస్తరణపై నిర్ణయం తీసుకోలేదు: ఆజాద్

By Pratap
|
Google Oneindia TeluguNews

Ghulam Nabi Azad
హైదరాబాద్: మంత్రి విస్తరణ ఓ కొలిక్కి వచ్చినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో మంత్రి వర్గ విస్తరణపై ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ అన్నారు. మంత్రి వర్గ విస్తరణ ఏ రోజు ఉంటుందనే విషయాన్ని చెప్పలేనని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. మంగళవారం సాయంత్రం ఆయన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో సమావేశమయ్యారు. బుధవారం ఉదయం కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి ఆయన పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో సమావేశమయ్యారు. దాదాపు గంటన్నర పాటు సోనియాతో చర్చలు జరిపారు. ఈ స్థితిలో మంత్రి వర్గ విస్తరణపై ముఖ్యమంత్రికి సోనియా నుంచి గ్రీన్ సిగ్నల్ లభించిందని, మంత్రి విస్తరణపై ముఖ్యమంత్రి తుది కసరత్తు చేస్తున్నారని వార్తలు వచ్చాయి.

ఆజాద్ తాజా ప్రకటనతో మంత్రి వర్గ విస్తరణ ఆశలపై నీళ్లు చల్లినట్లు అయింది. బుధవారం సాయంత్రం 3 గంటల నుంచి ఐదున్నర గంటల వరకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఆజాద్, సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ రహస్యంగా సమావేశమయ్యారు. ఈ సమయంలో ఆజాద్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రేపు మంత్రి వర్గ విస్తరణ ఉంటుందా అని అడిగితే రేపటి సంగతి రేపు చూడవచ్చునని ఆయన సమాధానం ఇచ్చారు. చిరంజీవి వర్గానికి చెందిన ఇద్దరిని మాత్రమే మంత్రి వర్గంలోకి తీసుకుని విస్తరణను ఆపేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసిందే. మంత్రివర్గ మార్పులకు, చేర్పులకు తుది దశలో బ్రేకులు పడినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి సూచిస్తున్న పేర్లపై, వారిని మంత్రి వర్గంలోకి తీసుకుంటే పార్టీకి కలిగే ప్రయోజనాలపై, కొంత మందికి ఉద్వాసన పలికితే సంభవించే పరిణామాలపై చర్చించిన తర్వాత పునర్వ్యస్థీకరణకు స్వస్తి చెప్పాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

English summary
Congress AP affairs incharge Ghulam Nabi Azad said that no decision was taken on cabinet expansion.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X