హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ కంపెనీలకు సలహా, ల్యాప్‌టావ్ ఇవ్వండి: సాయి

By Pratap
|
Google Oneindia TeluguNews

Vijaya Sai Reddy
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ కంపెనీలన్నీ తనపైనే ఆధారపడి ఉన్నాయని, వాటికి సలహాలు ఇవ్వడానికి తనకు ల్యాప్‌టాప్ ఇవ్వాలని వైయస్ జగన్ ఆస్తుల కేసులో అరెస్టయిన విజయ సాయి రెడ్డి కోరారు. జైలులో ల్యాప్‌టాప్ ఉపయోగించుకునే అవకాశం కల్పించాలని, మాటలను రికార్డు చేసి అవసరమైతే ప్రింట్ కూడా తీసుకునే వెసులుబాటు ఉండే 'డిక్టాఫోన్' అందించాలని ఆయన సీబీఐ ప్రత్యేక న్యాయస్థానాన్ని కోరారు. దీనిపై మంగళవారం ఓ పిటిషన్ దాఖలు చేశారు. "నేను వైఎస్ జగన్ కంపెనీలకు ప్రధాన ఆడిటర్‌ను. ఆర్థిక సలహాలు కూడా ఇస్తున్నాను. ఆయా కంపెనీలు పూర్తిగా నా సేవలపైనే పూర్తిగా ఆధారపడ్డాయి. వాటికి నా అవసరం చాలా ఉంది. వీటితోపాటు కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలు కంపెనీలకు నేను భాగస్వామిగా ఉన్న 'వీఎస్ రెడ్డి ఎస్‌పీ అండ్ అసోసియేట్స్ చార్టెడ్ ఎక్కౌంటెంట్' సంస్థ సేవలు అందిస్తోంది. నేను జ్యుడీషియల్ కస్టడీలో ఉండటంతో ఆ కంపెనీలకు సేవలు అందించలేకపోతున్నాను. దానివల్ల వాటికి నష్టం వాటిల్లుతోంది. ప్రస్తుతం నాకు లాప్‌టాప్ (లేదా కంప్యూటర్) అవసరం ఉంది. దాన్ని ఉపయోగించుకునేందుకు అనుమతించండి'' అని విన్నవించుకున్నారు.

సాయిరెడ్డి కస్టడీ గడువు ముగియడంతో సీబీఐ అధికారులు మంగళవారం ఆయనను కోర్టులో హాజరు పరిచారు. సాయిరెడ్డి తరఫు న్యాయవాది అశోక్‌రెడ్డి కోర్టులో ఈ పిటిషన్ వేశారు. కోర్టుల్లో పిటిషన్ దాఖలు చేసే ముందు, న్యాయవాదులకు తగు సూచనలు ఇచ్చేందుకు కూడా కంప్యూటర్ అవసరమని విజయ సాయి రెడ్డి చెప్పారు. సాయిరెడ్డి ల్యాప్‌టాప్ ద్వారా ఇచ్చే సూచనలకు ఆయన తరఫు న్యాయవాదులు పొందేందుకు పెన్‌డ్రైవ్‌ను కూడా అనుమతించాలని కోరారు. మాటలను రికార్డు చేసి, అక్షర రూపంలోకి మార్చి, ప్రింట్ చేసుకునేందుకు అవసరమైన 'డిక్టాఫోన్' పరికరాన్నీ ఇప్పించాలని సాయిరెడ్డి కోరారు. జైలులో ల్యాప్‌టాప్, పెన్ డ్రైవ్, డిక్టాఫోన్ వంటివి వాడుకునేందుకు అనుమతించాలని కోరిన నిందితుడు బహుశా సాయిరెడ్డి ఒక్కరే కావొచ్చని న్యాయవాద వర్గాలు చెబుతున్నాయి. ఈ పిటిషన్‌పై విచారణను జడ్జి నాగమారుతీ శర్మ ఈనెల 20కి వాయిదా వేశారు. సాయిరెడ్డి జ్యుడీషియల్ కస్టడీని సీబీఐ కోర్టు ఈ నెల 31 వరకు పొడిగించింది.

English summary
Arrested in YS jagan assets case, Vijaya Sai Reddy appealed to the court to provide laptop.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X