హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మావాళ్లకు తగిన శాస్తి: విస్తరణపై తెలంగాణ ఎంపీలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Madhu Yashki-Gutta Suhendar Reddy
హైదరాబాద్: మంత్రి పదవుల కోసం పాకులాడిన తెలంగాణ ప్రాంత నేతలకు తగిన శాస్తి జరిగిందని తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు గురువారం మీడియా సమావేశంలో అన్నారు. వివేక్ ఇంట్లో ఎంపీలు భేటీ అయ్యారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. పదవుల కోసం పాకులాడ వద్దని తమ పార్టీ తెలంగాణ నేతలకు సూచించారు. మొదట రాష్ట్రం కోసం పోరాటం చేద్దామని, తెలంగాణ వస్తే అన్ని పదవులు మనవేనని సూచించారు. పదవుల కన్నా రాష్ట్రమే తమకు ముఖ్యమన్నారు. మంత్రివర్గంలో తెలంగాణ నేతలకు అన్యాయం జరిగిందన్నారు. అయితే కేబినెట్లోకి ఎవరిని తీసుకున్నా, తీసుకోక పోయినా తాము ప్రశ్నించమన్నారు. జాతీయ రహదారుల విషయంలోనూ అన్యాయం జరిగిందని, తెలంగాణకు జరిగిన అన్యాయాలను అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్తామన్నారు.

పదవుల కోసం, ఉప ఎన్నికల్లో సీట్ల కోసం తిరిగే వాళ్లు తెలంగాణ ద్రోహులు అన్నారు. ఉద్యమాన్ని నీరుగార్చే విధంగా ప్రవర్తించవద్దన్నారు. డిజిపి దినేష్ రెడ్డి హయాంలో పోలీసులు రాజకీయ నేతల్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ఐనా, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఐనా, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ చీఫ్ జగన్మోహన్ రెడ్డి ఐనా, ముఖ్యమంత్రి కిరణ్ అయినా సీమాంధ్ర నేతలంతా తెలంగాణ వ్యతిరేకులేనన్నారు.

English summary
Telangana Congress MPs blamed at mlas for their lobbying in New Delhi for ministry. They accused that Telangana getting injustice in Seemandhra leadership.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X