తెలంగాణ వాటా భర్తీ చేస్తాం: ఏఐసిసి కృష్ణమూర్తి, బొత్స
State
oi-Srinivas
By Srinivas
|
హైదరాబాద్: త్వరలో తెలంగాణ వాటాను భర్తీ చేస్తామని ఏఐసిసి కార్యదర్శి కృష్ణమూర్తి గురువారం చెప్పారు. తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి వర్గం నేతల ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన హాజరయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర మంత్రివర్గంలో త్వరలో తెలంగాణ వాటాను సర్దుబాటు చేస్తామని చెప్పారు. శంకర రావును మంత్రిగా తొలగించే విషయం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పరిధిలోని అంశమని చెప్పారు. విలీనం సమయంలో పిఆర్పీకి ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామన్నారు. పునర్వ్యవస్థీకరణ కసరత్తు కొనసాగుతోందని, మఖ్యమంత్రి కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్ దీనిపై కసరత్తు చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రిపై అసంతృప్తితోనే పునర్వ్యవస్థీకరణకు అనుమతి ఇవ్వలేదనే దాంట్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు. విస్తరణ ద్వారా ఆయనను బలహీనపర్చినట్టు కాదన్నారు. త్వరలో ప్రాంతీయ సమతుల్యత ఉంటుందన్నారు.
పిఆర్పీ విలీనం సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని పిసిసి చీఫ్ బొత్స వేరుగా స్పష్టం చేశారు. చిరుకు ఇచ్చిన హామీలో కొంతైనా పూర్తైందన్నారు. విలీనం సమయంలోనే సోనియా గాంధీ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. మంత్రి వర్గ విస్తరణపై ఎవరికైనా అపోహలుంటే తొలగిస్తామన్నారు. తెలంగాణకు విస్తరనతో ముడి పెట్టవద్దని, అందరికీ సమ న్యాయం జరుగుతుందన్నారు.