వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ ఓదార్పులో అపశ్రుతి, తొక్కిసలాటలో ఒకరి మృతి!

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jaganmohan Reddy
గుంటూరు: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తుందో ఆ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదివారం తన గుంటూరు జిల్లా ఓదార్పు యాత్రలో చెప్పారు. జగన్ దాచేపల్లి మండలంలో ఓదార్పు యాత్ర నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పావలా వడ్డీ రుణాలు పోయి త్వరలో వడ్డీ లేని రుణాలు వస్తాయని చెప్పారు. బెల్టు షాపులు లేని రోజులు కూడా త్వరలో రానున్నాయన్నారు. వెయ్యి మంది ఉన్న ప్రతి గ్రామంలో పది మంది మహిళా పోలీసులతో పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రజల చేత, ప్రజల కొరకు ఎన్నికోబడిన నేత దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి మాత్రమేనన్నారు. వైయస్ మరణాన్ని తట్టుకోలేక మరణించిన కుటుంబాలను పరామర్శిస్తానని ఆనాడే చెప్పానన్నారు. అందుకే తాను ఓదార్పు యాత్ర చేపట్టానని తెలిపారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నానని కాబట్టే ప్రభుత్వాలు తనపై సిబిఐ, ఇన్‌కాం ట్యాక్స్ దాడులు చేయిస్తోందన్నారు.

రైతులపై తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు రైతులకు ఏమీ చేయని బాబును ప్రజలు నమ్మరన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెసు నేతల దృష్టంతా అధిష్టానం పైనే ఉందన్నారు. కాగా జగన్ తన ఓదార్పు యాత్రలో పలుచోట్ల వైయస్సార్ విగ్రహాలను ఆవిష్కరించారు. కాగా గుంటూరు జిల్లా జగన్ ఓదార్పు యాత్రలో అపశ్రుతి చోటు చేసుకుంది. దాచేపల్లి మండలం ముత్యంపాటులో రామారావు అనే వ్యక్తి తొక్కిసలాటలో మృతి చెందినట్లుగా వార్తలు వస్తున్నాయి.

English summary
YSR Congress Party chief YS Jaganmohan Reddy announced in Guntur odarpu yatra that what he will do if his party come to rule.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X