వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాలయ్యకూ అదే అవుతుంది: ముత్యం రెడ్డి వ్యాఖ్య

By Pratap
|
Google Oneindia TeluguNews

Cheruku Muthyam Reddy
హైదరాబాద్: తెలంగాణలో తెలుగుదేశం నాయకుడు, హీరో బాలకృష్ణ పోటీ చేస్తే అసలు రంగు బయటపడుతుందని తెలంగాణకు చెందిన కాంగ్రెసు శాసనసభ్యుడు చెరుగు ముత్యంరెడ్డి వ్యాఖ్యానించారు. ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేయవచ్చునని, అయితే తెలంగాణలో బాలకృష్ణ పోటీ చేస్తే రంగు బయటపడుతుందని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. గతంలో ముఖ్యమంత్రి అవుదామని వచ్చినవారు ఏమయ్యారో తెలుసునని ఆయన చిరంజీవిని ఉద్దేశించి అన్నారు. గతంలో ముఖ్యమంత్రులం అవుతామని వచ్చారని, వారేమయ్యారో బాలకృష్ణ కూడా అదే అవుతారని ఆయన అన్నారు.

ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని పార్టీ పెట్టినవారు ఏమయ్యారో అందరికీ తెలుసునని ఆయన అన్నారు. జేబులు కొట్టేవారికి తాను మద్దతు ఇవ్వలేనని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్టీలో గ్రూపు రాజకీయాలు ఉన్నాయని ఆయన అన్నారు. తనపై రాష్ట్ర కాంగ్రెసు వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్‌కు ఫిర్యాదు చేసినా అభ్యంతరం లేదని, తాను భయపడేది ఏమీ లేదని ఆయన అన్నారు. తెలంగాణలో పోటీ చేయాలని తెలుగుదేశం తెలంగాణ నాయకులు బాలకృష్ణను ఆహ్వానిస్తున్నట్లు వచ్చిన వార్తలపై ముత్యం రెడ్డి స్పందించారు.

English summary
Congress MLA Cheruku Muthyam Reddy made comments against Balakrishna.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X