వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్‌తో ఒప్పందంతోనే శంకరరావుకు ఉద్వాసన: టిడిపి

By Pratap
|
Google Oneindia TeluguNews

Baireddy Rajasekhar Reddy and Gali Muddukrishnama Naidu
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డితో ఒప్పందంలో భాగంగానే కాంగ్రెసు పార్టీ మంత్రి వర్గం నుంచి పి. శంకరరావును మంత్రి వర్గం నుంచి తొలగించిందని తెలుగుదేశం పార్టీ నాయకుడు బైరెడ్డి రాజశేఖర రెడ్డి వ్యాఖ్యానించారు. రాజ్యసభ సీట్లు తగ్గుతాయనే ఉద్దేశంతోనే కాంగ్రెసు పార్టీ వైయస్ జగన్ వర్గానికి చెందిన శానససభ్యులపై అనర్హత వేటు వేయడం లేదని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. జగన్‌పై సిబిఐ విచారణ జరుగుతోందని, ఈ స్థితిలో జగన్‌తో కాంగ్రెసు ఒప్పందానికి వచ్చిందని ఆయన అన్నారు. సాక్షి దినపత్రిక, ఇందిరా టెలివిజన్‌లను వైయస్ జగన్ అవినీతి సొమ్ముతోనే స్థాపించారని ఆయన ఆరోపించారు.

తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసేందుకు కాంగ్రెసు పార్టీ పవర్ గేమ్ ఆడుతోందని తెలుగుదేశం మరో నాయకుడు గాలి ముద్దు కృష్ణమ నాయుడు అన్నారు. సమన్వయ కమిటీ పేరుతో ప్రభుత్వ అంశాలను కాంగ్రెసు రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ సమీక్షించడాన్ని ఆయన తప్పు పట్టారు. ఆజాద్ అధికారిక సమావేశాలు నిర్వహించడం తగదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి పనితీరును, ప్రభుత్వ వ్యవహారాలను శాసనసభ లేదా మంత్రి వర్గం మాత్రమే సమీక్షించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. సమన్వయ కమిటీలో ఉన్నవారంతా ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్నవారేనని ఆయన అన్నారు. మరో ఇద్దరు ముఖ్యమంత్రులు మారినా ఆశ్చర్యం లేదని ఆయన అన్నారు.

English summary

 TDP leaders Baireddy Rajasekhar Reddy and Gali Muddukrishnama Naidu lashed out at Congress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X