తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిరంజీవిని అడ్డుకున్న బిఇడి విద్యార్థులు, జగన్ పార్టీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
తిరుపతి: స్థానిక శాసనసభ్యుడు చిరంజీవిని బిఇడి విద్యార్థులు సోమవారం అడ్డుకున్నారు. తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. జివో నెంబర్ 3ను తొలగింప చేయాలని విజ్ఞప్తి చేశారు. చిరంజీవిని అడ్డుకున్న బిఇడి విద్యార్థులకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మద్దతు పలికింది. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధినేత నారాచంద్రబాబు నాయుడు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. చిరంజీవి నగరంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఉదయం తిరుపతి వచ్చారు. అంతకుముందు హైదరాబాద్ నుండి తిరుపతి విమానాశ్రయంలో దిగిన ఆయన మీడియాతో మాట్లాడారు. మంత్రి పదవులు మూడు ఇవ్వలేమని చెప్పి అధిష్టానం సర్దుకోమని చెప్పిందని, తెలంగాణకు మరో విధంగా న్యాయం చేస్తామని చెప్పిందని అందువల్లే రెండు మంత్రి పదవులు ఒప్పుకున్నట్లు చెప్పారు.

హీరో నందమూరి బాలకృష్ణ తనపై పోటీ చేస్తారనే అంశంపై స్పందిస్తూ ఆయన అన్న వ్యాఖ్యల్లో తప్పేమిటన్నారు. మనది ప్రజాస్వామ్య దేశమని, ఎవరు ఎక్కడైనా పోటీ చేయవచ్చునని చెప్పారు. కాగా ఆదివారం విశాఖపట్నంలో పర్యటించిన బాలకృష్ణ తాను చిరంజీవిపై పోటీ చేసేందుకు సిద్ధమని ప్రకటించిన విషయం తెలిసిందే.

English summary
BED students and YSR Congress Party activists obstructed Tirupati MLA Chiranjeevi at his own constituency.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X