వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాజీ ఉప ముఖ్యమంత్రి జగన్నాథరావు కన్నుమూత

By Pratap
|
Google Oneindia TeluguNews

C Jagannatha Rao
హైదరాబాద్: రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి సి.జగన్నాథరావు (83) సోమవారం సాయంత్రం హైదరాబాద్ పద్మారావునగర్‌లోని తన స్వగృహంలో మరణించారు. సాయంత్రం 5.15 గంటల సమయంలో బాత్‌రూంకు వెళ్లి కాలు జారి పడటంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. మెదక్ జిల్లా, నర్సాపూర్‌కు చెందిన జగన్నాథరావు 1929 మే 6నజన్మించారు. ఎల్ఎల్‌బీ పూర్తిచేసిన అనంతరం రాజకీయ రంగ ప్రవేశం చేశారు. కాంగ్రెస్ పార్టీ తరఫున 1967లో మొదటిసారి శాసనసభ్యుడిగా గెలుపొందారు. 1972 నుంచి 1994 వరకు జరిగిన ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేశారు. అయితే 1972, 83లో మాత్రమే గెలుపొందారు. 1972లో డిప్యూటీ స్పీకర్‌గా పనిచేశారు. 1974లో తెలంగాణ ప్రణాళిక, అభివృద్ధి కమిటీ చైర్మన్‌గా ఎంపికయ్యారు. 1980లో అంజయ్య మంత్రివర్గంలో ఆబ్కారీ మంత్రిగా చేశారు. 1982లో భవనం వెంకట్రామ్ హయాంలో ఉప ముఖ్యమంత్రి పదవి పొందారు. దాంతో పాటు ఎక్సైజ్, హోం, పరిశ్రమల శాఖల మంత్రిగా కొనసాగారు.

1969లో వచ్చిన తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ప్రభుత్వం ఆయనను తెలంగాణ ప్రాంతీయ అభివృద్ధి మండలి చైర్మన్‌గా నియమించారు. కాంగ్రెస్ రాజకీయాల్లో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు వర్గీయుడిగా జగన్నాథరావు కొనసాగారు. కేశవరావు, హనుమంతరావు, డి.శ్రీనివాస్ వంటి వారు అప్పట్లో ఆయన శిష్యులే. జగన్నాథరావుకు భార్య వనమాల, ఒక కుమారుడు శ్రీనివాస్, ఇద్దరు కూతుళ్లు శైలజ, నీరజ ఉన్నారు. సీఎంతో పాటు ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రి పొన్నాల లక్ష్మయ్య, కేసీఆర్ తదితరులు నివాళి అర్పించి కుటుంబసభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు.

English summary
Former deputy Chief Minister C Jagannatha Rao dead at his residence in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X