వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిరంజీవి దారిలో జగన్, ఎయిడ్స్‌తో చనిపోయినా:బైరెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Byreddy Rajasekhara Reddy
హైదరాబాద్: జగన్ కూడా తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి దారిలో కాంగ్రెసులో కలిసి పోవడానికి ప్రయత్నాలు ప్రారంభించారని, ఎయిడ్స్‌తో చనిపోయిన వారిని కూడా తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి మరణం వల్ల మరణించిన వారి ఖాతాలో వేసి, వారి కుటుంబాలను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఓదారుస్తున్నారని టిడిపి ప్రధాన కార్యదర్శి బైరెడ్డి రాజశేఖర రెడ్డి సోమవారం విమర్శించారు. ఏదో పిచ్చి పట్టినట్లు ఆయన యాత్ర సాగడంపై జనం విసుక్కుంటున్నారన్నారు. దాదాపు రెండున్నరేళ్లుగా జనాన్ని విసిగిస్తూ చివరకు ప్రసవం కష్టమై చనిపోయినవాళ్లని కూడా పరామర్శ జాబితాలో వేస్తున్నారని విమర్శించారు. వైఎస్ మరణించినప్పుడు ఆయన సొంత నియోజకవర్గం పులివెందులలోగానీ, కుటుంబంలోగానీ, బంధువుల్లోగానీ ఎవరూ చనిపోలేదని పేర్కొన్నారు. వైఎస్‌కు రూ.85 కోట్లు ఇచ్చానని కోనేరు ప్రసాద్ సిబిఐకి వాంగ్మూలం ఇచ్చినట్లు తెలిసి జగన్‌కు వణుకు పుడుతోందన్నారు. అందుకే టిడిపిపై దుష్ప్రచారం మొదలు పెట్టారని, కెవిపి ఇంటి పైభాగంలో ఉన్న వ్యక్తికే కాకినాడ పోర్టులో వైఎస్ వేల ఎకరాలు కట్టబెట్టారని ఆరోపించారు.

కానీ, జగన్ టిడిపిపై నిందలు మోపుతున్నారని, చిరంజీవిలా కాంగ్రెస్‌లో కలిసిపోవడానికి ఇప్పటికే ప్రయత్నాలు మొదలు పెట్టారన్నారు. ఇక్కడ ఒకటి రెండు మాటలు విసిరి, ఢిల్లీ వెళ్లి కాళ్లు పట్టుకొంటారని ధ్వజమెత్తారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఆయనపై దయ కలిగినట్లుగా ఉందని, జగన్‌పై హైకోర్టుకు లేఖ రాసిన శంకర రావును మంత్రివర్గం నుంచి తొలగించారన్నారు. కాగా, బాలకృష్ణకు పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వవచ్చా? అన్న ప్రశ్నకు ఆ పదవిని ఆయన కోరుకోవచ్చు లేదా కార్యకర్తలు కోరుకోవచ్చని, కానీ ఇంతపెద్ద పార్టీని నడిపించగల అనుభవం అధినేత చంద్రబాబు నాయుడుకు ఉందన్నారు. ఎప్పుడు, ఏం జరుగుతుందో ఎవరు చెప్పగలరని, చంద్రబాబు ప్రధాని అయితే ఇక్కడ ఏదైనా జరగవచ్చునని అన్నారు. బాలకృష్ణకు పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వాలని నేను అన్నట్లు సాక్షిలో స్ర్కోలింగ్ వచ్చిందని, అది అబద్దాల ఛానల్ అని రుజువైందన్నారు. ఆ పత్రిక, ఛానల్ చెప్పేది ఎంత నిజమో వాళ్లే రుజువు చేశారన్నారు.

English summary

 TDP leader Byreddy Rajasekhara Reddy said that YS Jaganmohan Reddy is following Tirupati MLA Chiranjeevi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X