హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జూనియర్ డాక్టర్లతో డిఎల్ రవీంద్రా రెడ్డి చర్చలు విఫలం

By Pratap
|
Google Oneindia TeluguNews

DL Ravindra Reddy
హైదరాబాద్: జూనియర్ డాక్టర్లతో ప్రభుత్వం తరపున వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి సచివాలయంలో బుధవారం సాయంత్రం జరిపిన రెండో దశ చర్చలు విఫలమయ్యాయి. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి చెప్పారు. తాము ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. స్లయిఫండ్ పెంచే విషయంలో ఒప్పందం కుదరలేదని జూనియర్ డాక్టర్ల ప్రతినిధులు మీడియాతో చెప్పారు. తమకు న్యాయపరంగా రావలసిన వాటికి కూడా మంత్రి అంగీకరించలేదని వారన్నారు. తమ సమస్యలపట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వారు విమర్శించారు. మంత్రి నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని, మూడు రోజుల పాటు అందుబాటులో ఉండనని మంత్రి చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. తాము అత్యవసర సేవలను బహిష్కరించలేదని, సాధారణ సేవలను మాత్రమే బహిష్కరించినట్లు చెప్పారు. జూనియర్ డాక్టర్లు ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటే కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారన్నారు.

జూనియర్ డాక్టర్లతో బుధవారం ఉదయం ప్రభుత్వం జరిపిన మొదటి దశ చర్చలు విఫలమయ్యాయి. దీంతో సాయంత్రం మరోసారి సమావేశమయ్యారు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం గత 18 రోజులుగా జూనియర్ డాక్టర్లు సమ్మె చేస్తున్నారు. ప్రభుత్వం తీరుకు నిరసనగా బుధవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు ఆమరణ దీక్షలు చేపట్టారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో ఆరుగురు జూడాలు ఆమరణ దీక్షకు దిగారు. అత్యవసర సేవలు కొనసాగిస్తామన్న వారు తమ సమస్యలను పరిష్కరించేంత వరకూ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. చర్చల పేరిట ప్రభుత్వం కాలయాపన చేస్తోందని జూనియర్ డాక్టర్లు ఆరోపించారు.

తాము సమ్మెను మరింత ఉధృతం చేస్తామని జూనియర్ డాక్టర్లు చెబుతుండగా ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కుంటామని మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి చెబుతున్నారు. తాము 25 నుంచి 30 శాతం వరకు స్టయిఫెండ్ పెంచుతామని చెబుతున్నామని, దానికి జూనియర్ డాక్టర్లు అంగీకరించడం లేదని, ప్రభుత్వం అంతకన్నా ఏమీ చేయలేదని ఆయన అన్నారు.

English summary
Talks between minister DL Ravindra Reddy and Jr doctors failed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X