హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గాలి యోగక్షేమాలు అడిగిన జడ్జి, రిమాండ్ పొడిగింపు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Gali Janardhan Reddy
హైదరాబాద్: కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి యోగక్షేమాలను సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి బుధవారం అడిగి తెలుసుకున్నారు. ఓబుళాపురం మైనింగ్ కేసులో అరెస్టైన గాలి, శ్రీనివాస్ రెడ్డిల రిమాండ్ ముగియడంతో న్యాయమూర్తి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారిని విచారించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి వారి క్షేమ సమాచారం అడిగారు. ఓఎంసి కేసులో చార్జీషీట్ దాఖలు చేసినందున తమకు బెయిల్ ఇవ్వాలని నిందితులు కోర్టును కోరారు. బెయిల్ ఇస్తే సాక్ష్యులను బెదిరించే అవకాశమున్నందున ఇవ్వవద్దని సిబిఐ తరఫు న్యాయవాది వాదించారు. ఇరువురి వాదనలు విన్న అనంతరం వారిద్దరికీ ఫిబ్రవరి 8వ తేది వరకు రిమాండ్ పొడిగించారు.

కాగా ఎమ్మార్ కేసులో అరెస్టైన కోనేరు ప్రసాద్ రిమాండును కూడా కోర్టు ఫిబ్రవరి 1వ తేది వరకు పొడిగించింది. ఈయనను కూడా కోర్టు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించింది. ఈ సందర్భంగా తనను చికిత్స కోసం అధికారులు నిమ్స్‌కు తరలించలేదని న్యాయమూర్తికి కోనేరు విన్నవించుకున్నారు. అది జైలు అధికారులు చూసుకుంటారని జడ్జి చెప్పారు. మరోవైపు ఓఎంసి కేసులో అరెస్టైన ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మిని నాంపల్లి కోర్టులో సిబిఐ హాజరు పరిచింది. ఆమె రిమాండ్ నేటితో ముగిసింది.

English summary
CBI special court judge asked Gali Janardhan Reddy's well being while hearing in OMC case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X