వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఇస్రో మాజీ చీఫ్ మాధవన్ నాయర్‌పై ప్రభుత్వం వేటు

మాధవన్ నాయర్ చైర్మన్‌గా ఉన్నప్పుడు దేవాస్‌తో కాంట్రాక్టు కుదిరింది. చంద్రయాన్ 1 ప్రాజెక్టు వెనక మాధవన్ నాయర్ ప్రతిభ ఉంది. దేవాస్ డీల్‌పై విచారణ జరిపిన ఉన్నత స్థాయి కమిటీ నివేదికను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం మాధవన్ నాయర్‌పై చర్యలు తీసుకుంది. యాంత్రిక్స్, దేవాస్ మధ్య జరిగిన ఒప్పందంపై విచారణ జరపడానికి ప్రధాని మే 31వ తేదీన సెంట్రల్ విజిలెన్స్ మాజీ కమిషన్ ప్రత్యూష్ సిన్హా నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో ఉన్నత స్థాయి కమిటీని నియమించారు. ఇస్రో ప్రస్తుత చైర్మన్ రాధాకృష్ణన్ తనను ఈ వ్యవహారంలో ఇరికించారని, డీల్‌తో తనకు ఏ విధమైన సంబంధం లేదని మాధవన్ నాయర్ అంటున్నారు.