వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇస్రో మాజీ చీఫ్ మాధవన్ నాయర్‌పై ప్రభుత్వం వేటు

By Pratap
|
Google Oneindia TeluguNews

Madhavan Nair
న్యూఢిల్లీ: వివాదాస్పదమైన యాంత్రిక్స్ - దేవాస్ డీల్‌లో ఇస్రో మాజీ చీఫ్ జి. మాధవన్ నాయర్‌పై ప్రభుత్వం వేటు వేసింది. మాధవన్ నాయర్‌తో పాటు మరో ముగ్గురు ప్రముఖ శాస్త్రవేత్తలను ప్రభుత్వ పదవులకు అనర్హులుగా ప్రకటించింది. నిబంధనలకు విరుద్ధంగా ఇస్రో ఎస్ బాండ్ స్పెక్ట్రమ్‌ను ప్రైవేట్ కంపెనీకి కేటాయించిందనే ఆరోపణలపై ప్రభుత్వం ఆ చర్యలు తీసుకుంది. నాయర్‌తో పాటు ఇస్రో మాజీ సైంటిఫిక్ సెక్రటరీ కె. భాస్కర నారాయణ, యాంత్రిక్స్ కమర్షియల్ ఆర్మ్ మేనేజింగ్ డైరెక్టర్ కెఆర్ సిద్ధమూర్తి, ఇస్రో శాటిలైట్ సెంటర్ మాజీ డైరెక్టర్ కెఎన్ శంకరలపై ప్రభుత్వం వేటు వేసింది.

మాధవన్ నాయర్ చైర్మన్‌గా ఉన్నప్పుడు దేవాస్‌తో కాంట్రాక్టు కుదిరింది. చంద్రయాన్ 1 ప్రాజెక్టు వెనక మాధవన్ నాయర్ ప్రతిభ ఉంది. దేవాస్ డీల్‌పై విచారణ జరిపిన ఉన్నత స్థాయి కమిటీ నివేదికను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం మాధవన్ నాయర్‌పై చర్యలు తీసుకుంది. యాంత్రిక్స్, దేవాస్ మధ్య జరిగిన ఒప్పందంపై విచారణ జరపడానికి ప్రధాని మే 31వ తేదీన సెంట్రల్ విజిలెన్స్ మాజీ కమిషన్ ప్రత్యూష్ సిన్హా నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో ఉన్నత స్థాయి కమిటీని నియమించారు. ఇస్రో ప్రస్తుత చైర్మన్ రాధాకృష్ణన్ తనను ఈ వ్యవహారంలో ఇరికించారని, డీల్‌తో తనకు ఏ విధమైన సంబంధం లేదని మాధవన్ నాయర్ అంటున్నారు.

English summary
Taking action in the controversial Antrix-Devas deal, government has barred former ISRO chief G Madhavan Nair and three other eminent space scientists from holding any government jobs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X