నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గుప్తనిధుల కోసం శ్యాంఘడ్‌కోటలో బాలుడి బలి, అరెస్ట్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Nizamabad District
నిజామాబాద్: గుప్త నిధుల కోసం ఓ బాలుడిని బలిచ్చిన విషాదకర సంఘటన నిజామాబాద్ జిల్లాలో గురువారం వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని నిర్మల్‌లోని శ్యాంఘడ్ కోటలో గణేష్ అనే బాలుడిని కొందరు దుండగులు నిధులు బయట పడుతాయనే మూడనమ్మకంతో బలి ఇచ్చారు. అమావాస్య రోజు బలి ఇచ్చారు. గణేష్ స్థానిక చాణక్య కాన్సెప్ట్ పాఠశాలలో చదువుతున్నారు. ఇతని వయస్సు పద్నాలుగేళ్లు. తమకు పిల్లలు లేరని ఇటీవల కొందరు గణేష్‌ను రూ.ఇరవై వేలకు కొనుగోలు చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. గుప్త నిధుల కోసం బాలుడిని బలిచ్చిన తర్వాత అతనిని అక్కడే పూడ్చి పెట్టారు. ఇద్దరు కలిసి ఈ ఘాతుకానికి పాల్పడ్డట్టుగా తెలుస్తోంది. అందులో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అయితే కొందరు వ్యక్తులు మూడు నెలల నుండి గణేష్‌ను టార్గెట్ చేసుకొని, తమ కుటుంబంతో పరిచయాలు పెంచుకొని, ఇటీవల మోటార్ బైక్ నేర్పుతామని స్కూల్ నుండి ఇంటికి వచ్చిన తర్వాత తీసుకు వెళ్లారని గణేష్ బంధువులు చెబుతున్నారు. తమ వద్దనుండి గణేష్‌ను తీసుకు వెళ్లిన వారే రూ.ఇరవై వేలకు అమ్మినట్లుగా వార్తలు వస్తున్నాయన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని వారు విజ్ఞప్తి చేశారు. కాగా శ్యాంఘడ్ కోటలో కొన్నేళ్లుగా గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతున్నప్పటికీ పట్టించుకున్న దాఖలాలు లేవని స్థానికులు ఆరోపిస్తున్నారు.

English summary
Unknown persons killed fourteen years boy for money. Police arrested one accuse today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X