గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పల్నాడులో వ్యాట్‌పై పోటా పోటీ: జగన్ వర్సెస్ కోడెల

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan-Kodela Siva Prasad
గుంటూరు: జిల్లాలోని నరసారావుపేటలో వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు పోటా పోటీ దీక్షలకు దిగుతున్నాయి. వస్త్రాలపై విలువ ఆధారిత పన్ను(వ్యాట్)ను నిరసిస్తూ రెండు పార్టీలు ఒకే పట్టణంలో ఆందోళనలకు దిగుతున్నాయి. వ్యాట్ భారం మోపవద్దని డిమాండ్ చేస్తూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆధ్వర్యంలో నరసారావుపేటలో శుక్రవారం ఉదయం పదకొండు గంటలకు ధర్నా ప్రారంభమవుతుంది. ఈ ధర్నా కార్యక్రమంలో ఆ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొంటారు. ఆయన ప్రస్తుతం ఓదార్పు యాత్రలో ఉన్నారు. అదే పట్టణంలో కొద్దిసేపు ఓదార్పు యాత్రలో పాల్గొని అనంతరం పదకొండు గంటలకు ఆయన ఆర్డీవో ఆఫీసు వద్దకు చేరుకొని ధర్నాలో పాల్గొంటారు. మరోవైపు వ్యాట్‌పై క్లాత్ మర్చంట్ అసోసియేషన్ వ్యాపారులు చేసే ఆందోళనకు తాము మద్దతిస్తామని తెలుగుదేశం పార్టీ నేత కోడెల శివ ప్రసాద్ చెప్పారు. ఈ ఆందోళనలో ఎంపి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పాల్గొంటారు.

వస్త్ర వ్యాపారులకు మద్దతు పేరుతో టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు ఆందోళనకు ఒకేరోజు దిగేందుకు సిద్ధం కావడంతో పోలీసులు టిడిపికి ఉదయం తొమ్మిది గంటల నుండి పదకొండు గంటల వరకు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి పదకొండు గంటల తర్వాత అనుమతి ఇచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకున్నామని, ఎటువంటి పరిస్థితులు తలెత్తినా అందుకోసం తాము అప్రమత్తంగా ఉన్నామని పోలీసులు చెబుతున్నారు. భారీగా పోలీసులను మోహరించారు. ఆందోళన విషయంలో వెనక్కి తగ్గేది లేదని ఇరుపార్టీలో చెబుతున్నాయి. మొత్తానికి పల్నాడులో రెండు పార్టీల ఆందోళన ఘాటెక్కిస్తోంది.

English summary
Guntur politics heated with YSR Congress Party and Telgudesam Party agitation against VAT at Narasaraopet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X