వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎమ్మెల్యే శివరాత్రికైనా వస్తారా: పొన్నం ప్రభాకర్ ప్రశ్న

By Pratap
|
Google Oneindia TeluguNews

Ponnam Prabhakar
కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కరీంనగర్ జిల్లా వేములవాడ శానససభ్యుడు చెన్నమనేని రమేష్‌పై కాంగ్రెసు కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శాసనసభ్యుడు జర్మనీలో ఉంటే సమస్యలు పరిష్కారం కావని ఆయన శనివారంనాడు అన్నారు. ఈ శివరాత్రికైనా రమేష్ నియోజకవర్గానికి వస్తారా అని ఆయన అడిగారు. జర్మనీలో ఉండి వినోదాలతో కాలం గడిపితే ప్రజా సమస్యలు పరిష్కారం కావని ఆయన అన్నారు. రమేష్‌పై శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు ఫిర్యాదు చేస్తానని ఆయన చెప్పారు.

రమేష్ విదేశాల్లో భోగాలు అనుభవిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. సొంత నియోజకవర్గంలోని కార్యక్రమాలకు కూడా శాసనసభ్యుడు రాకపోతే ఎలా అని ఆయన అడిగారు. శాసనసభ్యుడికి అలవెన్సులు ఆపేయాలని తాను స్పీకర్‌ను కోరుతానని ఆయన చెప్పారు. గతంలో తెలుగుదేశం పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహించిన చెన్నమనేని రమేష్ తెలంగాణపై చంద్రబాబు వైఖరిని నిరసిస్తూ రాజీనామా చేసి తెరాసలో చేరి తిరిగి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు.

English summary
Congress Karimnagar MP Ponnam Prabhakar has fired at TRS Cemulawada MLA Ch Ramesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X