వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబు అన్నాడు, విగ్రహాల ధ్వంసం మొదలైంది: బాజిరెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Bajireddy Govardhan Reddy
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహాల గురించి ఏ క్షణాన మాట్లాడారో అప్పటి నుండి రాష్ట్రంలో పలు విగ్రహాల ధ్వంసం ప్రారంభమైందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి సోమవారం విమర్శించారు. రాష్ట్రంలో విగ్రహాల విధ్వంసానికి చంద్రబాబు వ్యాఖ్యలే కారణమని ఆరోపించారు. విగ్రహాలు కూల్చిన వారిని వదిలేసి కొత్త వారిని తెరపైకి తీసుకు వస్తున్నారని ఆయన అన్నారు. కూల్చివేత వెనుక ఉన్న కుట్రను బయట పెట్టాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మద్యం మాఫియాలో చిన్న నేతలను, అధికారులను ఇరికించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, మంత్రి బొత్స సత్యనారాయణ బహిరంగంగానే తన కుటుంబానికి మద్యం దుకుణాలు ఉన్నాయని చెప్పారని, అలాంటి వారి జోలికి ప్రభుత్వం ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు.

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విగ్రహాలపై జరిగిన దాడిని ఆయన ఖండించారు. కాగా ఇటీవల అమలాపురం నియోజకవర్గంలో పలు అంబేడ్కర్ విగ్రహాలను ఒకేరోజు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కూడా పలు అంబేడ్కర్ విగ్రహాలపై దాడులు జరిగాయి. స్వర్గీయ నందమూరి తారక రామారావు, దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహాల పైనా పలు చోట్ల దాడులు జరిగాయి.

English summary
YSR Congress party leader Bajireddy Govardhan Reddy blamed TDP chief Nara Chandrababu Naidu for statues destoy in state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X