వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిఎస్‌తో జెడి భేటీ: బిపి ఆచార్యపై వేటుకు రంగం సిద్ధం?

By Srinivas
|
Google Oneindia TeluguNews

BP Acharya
హైదరాబాద్: ఎమ్మార్ కేసులో సోమవారం అరెస్టైన ఐఏఎస్ అధికారి బిపి ఆచార్యపై వేటు వేసేందుకు రంగం సిద్ధమవుతున్నట్లుగా కనిపిస్తోంది. సాధారణంగా ఏ అధికారి అయినా అరెస్టై జైలులో 48 గంటలు ఉంటే ఆయనపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేస్తుంది. బిపి ఆచార్య సోమవారం అరెస్టయ్యారు. ఉన్నతాధికారుల అరెస్టుల విషయాన్ని సంబంధిత అధికారులు ప్రభుత్వానికి తెలియజేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో సిఎస్ పంకజ్ ద్వివేదితో సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ మంగళవారం ఉదయం భేటీ అయ్యారు. ఈయన ప్రధానంగా రెండు అంశాల గురించి సిఎస్‌తో భేటీ అయినట్లుగా తెలుస్తోంది. బిపి ఆచార్య అరెస్టు విషయం తెలియజేయడం మొదటి అంశం. జెడి సమాచారం అందించిన తర్వాత ఆచార్యపై వేటుకు రంగం సిద్ధమయ్యే అవకాశముంది. గతంలో శ్రీలక్ష్మి అరెస్టైనప్పుడు కూడా జెడి సిఎస్‌తో భేటీ అయ్యారు.

ఎమ్మార్ కేసులో మరో రెండు మూడు రోజుల్లో ఛార్జీషీట్ దాఖలు చేయాల్సి ఉంది. దీంతో ప్రభుత్వ శాఖల నుండి మరింత సమాచారం అందించాల్సిందిగా కోరేందుకు కూడా జెడి భేటీ అయినట్లు తెలుస్తోంది. గతంలో వివిధ శాఖల నుండి సమాచారం కొంత ఆలస్యంగా వచ్చిందని, ఛార్జీషీట్ దాఖలు చేయాల్సిన ప్రస్తుత పరిస్థితుల్లో మరింత విలువైన సమాచారం సాధ్యమైనంత త్వరగా ఇప్పించాలని ఆయన కోరనున్నారని సమాచారం.

English summary
CBI joint director Laxmi Narayana met CS Pankaj Dwivedi today. It seems, BP Acharya may suspended soon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X