వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేను వస్తే ఆ ఒక్కటి మినహా అన్నీ పరిష్కరిస్తా: జగన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: తమ పార్టీ అధికారంలోకి వస్తే జూడాల డిమాండ్లలో మూడో పాయింట్ తప్ప మిగిలిన అన్నింటిని పరిష్కరిస్తామని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం అన్నారు. తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ మహాత్మా గాంధీ హాస్పిటల్‌లో నిరాహార దీక్ష చేస్తున్న జూడాలను వైయస్ జగన్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జూడాల డిమాండ్లు ప్రభుత్వం నేరుగా పరిష్కరించవచ్చునని అన్నారు. మెడికల్ కౌన్సిల్ మార్గదర్శకాల ప్రకారమే తమకు స్టైఫండ్ కావాలని జుడాలు కోరుతున్నారన్నారు. మేం అధికారంలోకి వచ్చిన మొదటి రోజే మూడో పాయింట్ మినహా డిమాండ్లు పరిష్కరిస్తామన్నారు. మూడో పాయింట్‌లో కొన్ని సవరణలు మాత్రమే కోరతామన్నారు. జుడాల డిమాండ్లు అన్ని మానవత్వమైనవేనన్నారు. ఒక్క కలం పోటుతో వీటిని పరిష్కరించవచ్చునని అన్నారు.

పిల్లల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం ఆడుకుంటోందని ధ్వజమెత్తారు. విద్యార్థులు నిరాహార దీక్ష చేసి ఏడు రోజులు కావొస్తున్నా ప్రభుత్వం స్పందించక పోవడం బాధాకరమన్నారు. వారి డిమాండ్లు అన్నీ సమంజసమైనవేనన్నారు. ఈ డిమాండ్లు నెరవేర్చేందుకు సబ్ కమిటీ అవసరం లేదన్నారు. నిరాహార దీక్షతో విద్యార్థులు ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని సూచించారు. ఐసియులో ఉన్న ఓ డాక్టర్‌కు జగన్ నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు.

English summary
YSR Congress Party chief YS Jaganmohan Reddy promised to JUDAs that he will sign on their demands file if his party come in to rule.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X