హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రేపు జూడాల చలో హైదరాబాద్, సామూహిక దీక్షల యోచన

By Pratap
|
Google Oneindia TeluguNews

Jr Doctors
హైదరాబాద్: తమ డిమాండ్ల సాధన కోసం రేపు బుధవారం జూనియర్ డాక్టర్లు చలో హైదరాబాదుకు పిలుపునిచ్చారు. జిల్లాల నుంచి జూనియర్ డాక్టర్లు రేపు హైదరాబాదు చేరుకుంటారు. ఉదయం పది నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జిల్లాల నుంచి జూనియర్ డాక్టర్లు హైదరాబాదు చేరుకునే విధంగా కార్యక్రమాన్ని రూపొందించారు. తమ డిమాండ్ల పరిష్కారం విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న మొండివైఖరికి నిరసనగా ఆందోళనను మరింత ఉధృతం చేయాలని జూనియర్ డాక్టర్లు నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే వారు చలో హైదరాబాదుకు పిలుపునిచ్చారు. అదే సమయంలో రేపు సాయంత్రం నాలుగు గంటలకు అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేస్తున్నారు.

గత నెల రోజులుగా జూనియర్ డాక్టర్లు దశలవారీగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తూ ముందుకు సాగుతున్నారు. తొలుత రిలే నిరాహార దీక్షలు చేస్తూ సాధారణ సేవలను బహిష్కరించారు. ప్రభుత్వం తమపై ఎస్మా ప్రయోగిస్తే భయపడేది లేదని వారు స్పష్టం చేస్తున్నారు. సికింద్రాబాదులోని గాంధీ ఆస్పత్రిలో ఆరుగురు జూనియర్ డాక్టర్లు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఏడో రోజుకు చేరింది. వారిలో నలుగురి పరిస్థితి ఆందోళనకరంగా మారింది. వారిని దీక్షా శిబిరం నుంచి ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఒకతను దీక్ష విరమించాడు. మిగతా ఇద్దరిని ఈ రాత్రి శిబిరం నుంచి తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. వారిని ఆస్పత్రికి తరలిస్తే సామూహిక ఆమరణ నిరాహార దీక్షలకు దిగే యోచనలో జూనియర్ డాక్టర్లున్నారు.

రాష్ట్రంలో పది టీచింగ్ ఆస్పత్రులు ఉన్నాయి. ఈ పది టీచింగ్ ఆస్పత్రుల్లో ఒక్కో ఆస్పత్రి నుంచి ముగ్గురేసి ఆమరణ నిరాహార దీక్షకు దిగేందుకు సిద్ధపడుతున్నారు. ప్రభుత్వం తన మొండి వైఖరిని విడనాడకపోతే అత్యవసర సేవలను కూడా బహిష్కరిస్తామని జూనియర్ డాక్ట్రర్లు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే జూనియర్ వైద్యుల ఆందోళనకు ప్రతిపక్షాలన్నీ మద్దతు ప్రకటించాయి.

English summary
Jr Doctors have decided to take up Chalo Hyderabad tomorrow, protesting adamant attitude of government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X