వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అమ్మవారికి తులాభారం: సిఎం 78, చిరంజీవి 81.5

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chiranjeevi-Kiran Kumar Reddy
వరంగల్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బుధవారం మధ్యాహ్నం మేడారం సమ్మక్క, సారక్కలను దర్శించుకున్నారు. ఆయన తులాభారంతో అమ్మవార్లకు బంగారం(బెల్లం) సమర్పించుకున్నారు. 78 కిలోలు తూగిన ముఖ్యమంత్రి అంత బంగారాన్ని అమ్మవారికి సమర్పించారు. తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి 81.5 కిలోలు తూగారు. కాగా ముఖ్యమంత్రి పర్యటనలో మేడారంలో అపశృతి చోటు చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సిఎం కిరణ్ పట్టుకు వెళుతున్న పట్టు వస్త్రాలు ఆయన చేతిలో నుండి జారి కింద పడ్డాయి. అయితే సిఎం చేతిలో నుండి కాకుండా అధికారుల చేతిలో నుండి పడ్డాయని మరికొందరు చెబుతున్నారు. సిఎం చేతి నుండి పట్టు వస్త్రాలు పడిపోవడం అపచారమని భక్తులు ఆందోళన చెందుతున్నారు. దేవాదాయ శాఖ మంత్రి సి.రామచంద్రయ్య సారలమ్మలకు పట్టు వస్త్రాలు సమర్పించారు.

కాగా అంతకుముందు మేడారం బయలుదేరే ముందు ముఖ్యమంత్రి జైళ్ల శాఖ డ్యూటీ మీట్‌లో మాట్లాడారు. ఈ మీట్‌కు పదహారు రాష్ట్రాల అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ... శిక్షార్హులు అందరూ తప్పు చేసిన వారు కాదన్నారు. కొందరు క్షణికావేశంలో తప్పులు చేసిన వారు కూడా ఉన్నారన్నారు. ఖైదీలలో ఉన్న చెడును తొలగించేందుకు జైళ్ల శాఖ అధికారులు సమర్థవంతంగా పని చేస్తున్నారని కితాబిచ్చారు.

English summary
CM Kiran Kumar Reddy gave 78kgs and Tirupati MLA Chiranjeevi 81.5 kgs gold to Sammakka and Sarakka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X