వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రీజెన్సీ సిరామిక్స్ లాకౌట్, నడపలేమన్న చైర్మన్

By Pratap
|
Google Oneindia TeluguNews

Yanam
యానాం: యానాంలోని రీజెన్సీ సిరామిక్స్ మూతపడింది. సంస్థకు లాకౌట్ ప్రకటిస్తూ యాజమాన్యం బుధవారం ఉదయం ప్రకటన చేసింది. లాకౌట్ నోటీసును మంగళవారం రాత్రి అంటించారు. నష్టాన్ని అంచనా వేసే వరకు కర్మాగారాన్ని తెరిచే అవకాశం ఉండదని యాజమాన్యం చెబుతోంది. దీంతో కర్మాగారంలో పనిచేస్తున్న 6 వేల మంది కార్మికుల భవితవ్యంపై అంధకారం అలుముకుంది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని విద్యాసంస్థలను నడిపే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, అది కూడా సాధ్యమయ్యే పరిస్థితి లేదని రీజెన్సీ సిరామిక్స్ చైర్మన్ నాయుడు మాటలను బట్టి అర్థమవుతోంది. సంస్థలను తాను వదిలేసినట్లేనని ఆయన అన్నారు. అక్కడి పరిస్థితి సాధారణంగా లేదని, తీవ్రమైన భయాందోళనలు నెలకొన్నాయని, అక్కడికి ఎవరూ వెళ్లే పరిస్థితి లేదని ఆయన అన్నారు. బెదిరిస్తూ ఫోన్లు కూడా వస్తున్నాయని చెబుతున్నారని ఆయన అన్నారు. అక్కడి పరిస్థితి వల్లనే లాకౌట్ ప్రకటించినట్లు ఆయన ఓ టీవీ చానెల్ ప్రతినిధితో అన్నారు.

దుర్మార్గులు కంపెనీలో చేరి చెడగొట్టారని ఆయన అన్నారు. యానాంలోని కర్మాగారానికి వెళ్లే పరిస్థితి కూడా లేదని ఆయన అన్నారు. విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు కూడా భయపడుతున్నారని ఆయన అన్నారు. కర్మాగారంపై దాడి, దానికి సంబంధించిన సంఘటనల్లో బయటివారి పాత్ర ఉందని ఆయన అన్నారు. ఇటీవల జరిగిన సంఘటనల్లో కార్మిక నాయకుడు మురళీమోహన్ మరణించారు. అదే సమయంలో జరిగిన దాడిలో సంస్థ వైస్ చైర్మన్ చంద్రశేఖర్ మృతి చెందాడు. కర్మాగారం పూర్తిగా బుగ్గిపాలైంది. ఫ్యాక్టరీని నడిపే పరిస్థితి లేదని నాయుడు ఇది వరకే చెప్పారు.

English summary
Yanam Regency Ceramics announced lock out. Regency chairman Naidu said that dituation not permitting to run the factory.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X